బౌన్సర్లతో పెళ్లికి హాజరైన పల్లవి ప్రశాంత్… నీ బిల్డప్ చూడలేకపోతున్నాం అంటూ భారీ ట్రోల్స్!
TeluguStop.com
పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఒక యూట్యూబర్ గా రైతుబిడ్డగా వ్యవసాయ పనులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
అయితే ఈయన ప్రతి ఒక్క వీడియోలో తనకు బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమానికి వెళ్లాలని ఉందని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అంటూ ఈయన చివరికి బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ 7(Big Boss 7) కార్యక్రమంలో పాల్గొని రైతుబిడ్డ అంటూ హౌస్ లో సింపతి డ్రామాలు ప్లే చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక అనుకున్న విధంగానే పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి బయటకు వచ్చారు.ఇలా పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)విజేత అయిన తర్వాత ఈయన అసలు రూపం బయటపడింది.
బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న సమయంలో తాను గెలిస్తే కనుక ఆ డబ్బును మొత్తం ఒక రైతుగా రైతు బాధలు తెలిసిన వ్యక్తిగా ఆ డబ్బును రైతులకు పంచుతానని హామీలు ఇచ్చి సింపతి కొట్టేసి ఓట్లు సంపాదించుకున్నారు.
అయితే గెలిచిన తర్వాత మాత్రం ఈయన కేవలం ఒక కుటుంబానికి లక్ష రూపాయలు మరో కుటుంబానికి 20వేల రూపాయలు సాయం చేశారు కానీ ఇప్పటివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు దీంతో ఈయనపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
"""/" /
ఇలా రైతు బిడ్డగా ఒకప్పుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్న ఈయన ఇప్పుడు మాత్రం సెలబ్రిటీ రేంజ్ లో రాయల్ లైఫ్ గడుపుతున్నారు.
ఇక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలో పాల్గొంటూ పల్లవి ప్రశాంత్ బిజీగా గడుపుతున్నారు.
అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా(Sonia )ఆకుల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ వివాహ వేడుకలో పల్లవి ప్రశాంత్ కూడా పాల్గొన్నారు. """/" /
ఈ పెళ్లి వేడుకకు ఈయన ఏకంగా బౌన్సర్లతో కలిసి వచ్చారు.
ఇలా ఈ పెళ్లి వేడుకలో భాగంగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా పాల్గొని సందడి చేశారు అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం బౌన్సర్లను పెట్టుకొని ఈ పెళ్లి వేడుకల్లో కనిపించడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే వీడియోలపై నేటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.నీ బిల్డప్పులు చూడలేకపోతున్నాము నీకు బౌన్సర్లు అవసరమా అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు మాత్రం తన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే మరి కొంత మంది రైతులకు డబ్బులు ఎప్పుడు పంచుతావ్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.
బాలయ్యను వదిలి వెళ్లడం ఇష్టం లేక ఏడ్చేసిన చిన్నారి.. అసలేం జరిగిందంటే?