ఓటింగ్ లో చరిత్ర తిరగరాసిన పల్లవి ప్రశాంత్..దూసుకొస్తున్న అమర్ దీప్!

ఈ సీజన్ బిగ్ బాస్ షో ( Bigg Boss Show )కి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏ సీజన్ కి కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు ఎన్నో ఎమోషన్స్ మధ్య ఈ రియాలిటీ షో నడిచింది.

నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, అలా చూస్తూ ఉండగానే 14 వారాలు పూర్తి చేసుకుంది.

13 వారాలు మంచి హీట్ వాతావరణం లో నడిచిన ఈ షో, కనీసం చివరి రెండు వారాలు అయినా హ్యాపీ నోట్ తో ముగుస్తుంది అనుకున్నారు.

కానీ గత వారం అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) మధ్య జరిగిన గొడవ ఆడియన్స్ ని బాగా డిస్టర్బ్ చేసింది.

ఇక పోతే వీకెండ్ ఎపిసోడ్ లో శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వగా, అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్ మరియు ప్రియాంక ఫైనలిస్ట్స్ గా మిగిలారు.

"""/" / వీరిలో ఒకరు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్( Midweek Elimination ) ద్వారా బయటకి వెళ్ళిపోతారు అనే టాక్ ఉంది.

దీని గురించి నాగార్జున ఎలాంటి రెస్పాన్స్ ప్రకటన చెయ్యలేదు కానీ, మిడ్ వీక్ ఎలిమినేషన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది అనే విషయం మాత్రం తెలిసింది.

ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రిన్స్ యావర్ ( Prince Yavar )ఎలిమినేట్ అవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.

ఇక టైటిల్ విన్నర్ పోటీ కేవలం అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్యనే ఉంది అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కలేదు.

సోషల్ మీడియా లో ఏ పోలింగ్ తీసుకున్న వీళ్లిద్దరి టాప్ 2 లో ఉంటున్నారు.

కానీ అమర్ దీప్ ( Amar Deep )కి ఆన్లైన్ ఓటింగ్ లో కాస్త ఎడ్జి ఉండే అవకాశం ఉంది.

కానీ మిస్సెడ్ కాల్స్ విషయం లో మాత్రం పల్లవి ప్రశాంత్ రికార్డ్స్ ని నెలకొల్పటాని అంటున్నారు.

ఎందుకంటే ప్రశాంత్ పల్లెటూర్ల నుండి ఓట్లు వేసే వాళ్ళే ఎక్కువ. """/" / ఆయన ఓటింగ్ లైన్ కి ఎప్పుడు మిస్సెడ్ కాల్ చేద్దాం అనుకున్నా బిజీ గానే ఉంటుంది.

దీంతో ప్రశాంత్ ఫ్యాన్స్ తమ అభిమాన కంటెస్టెంట్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ పని చెయ్యడం లేదని సోషల్ మీడియా లో తెగ ఆరోపణలు చేసారు.

కానీ అత్యధికంగా ప్రశాంత్ నెంబర్ కి మిస్సెడ్ కాల్స్ ఇస్తుండడం తో ట్రాఫిక్ కారణంగా కలవడం లేదట.

దీని బట్టి ప్రశాంత్ కి ఏ రేంజ్ ఓట్లు వచ్చి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

అమర్ దీప్ ఫోన్ నెంబర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.మరి వీళ్ళిద్దరిలో ఎవరు టైటిల్ గెలుచుకోబోతున్నారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

15 ఏళ్ల న్యాయపోరాటంలో గూగుల్‌కు ఊహించని షాక్.. యూకే కపుల్‌కు భారీ పరిహారం..