ఈట‌ల టార్గెట్‌గా ప‌ల్లా రాజకీయాలు.. రైతుల‌ను తిప్పేసుకుందామ‌ని..!

ఈట‌ల రాజేంద‌ర్ పేరు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎంత‌గా మారుమోగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఆయ‌న టీఆర్ ఎస్‌కు, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌కు తెర లేపిన‌ట్ట‌యింది.

అనూహ్యంగా ఈట‌ల‌పైకి ఆయ‌న న‌మ్మిన వారినే కేసీఆర్ రంగంలోకి దించుతున్నారు.ఈ క్ర‌మంలో ఇప్పటికే ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌రావుతో వైరం పెంచిన కేసీఆర్‌.

ఇప్పుడు ఆయ‌న టీమ్‌లో కీలకంగా ప‌నిచేస్తున్న ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డిని వాడుతున్నారు.హుజూరాబాద్‌లో ఎలాగైనా ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌భావాన్ని త‌గ్గించి టీఆర్ ఎస్‌ను గెలిపించేందుకు ఆయ‌న ప్లాన్ వేస్తున్నారు.

ఇందులో భాగంగా టీఆర్ ఎస్‌కు మొద‌టి నుంచి అండ‌గా ఉంటున్న రైతు కుటుంబాల‌ను ఆక‌ట్టుకునేందుకు సీఎం కేసీఆర్ రైతుల‌కు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలైన రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వ‌రం లాంటి వాటిని వివ‌రిస్తూ హుజురాబాద్‌లోని ఐదు మండ‌లాల రైతుల‌కు ఆయ‌న లేఖ‌లు రాస్తున్నారు.

వాటిల్లో కేసీఆర్ చేస్తున్న వాటితో పాటు రేపు హుజూరాబాద్ లో టీఆర్ ఎస్ గెలిస్తే ఏమేం చేస్తామ‌నేది చాలా క్లియ‌ర్‌గా రాసి పంపిస్తున్నారు.

"""/"/ఎలాగైనా ఈట‌ల కేంద్రీ కృతంగా న‌డుస్తున్న చ‌ర్చ‌ను టీఆర్ ఎస్ వైపు మ‌ళ్లించేందుకు ప్లాన్ వేస్తున్నారు.

అయితే రైతుల‌కు లేఖ‌లు రాస్తే ఆ ప్లాన్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేదే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎందుకంటే ఏదైనా విష‌యం ఉంటే డైరెక్టుగా చెప్పాలి గానీ ఇలా లేఖ‌లు రాస్తే రైతుల‌కు చ‌దువు వ‌స్తుందా అనే ప్ర‌వ్న‌లు కూడా త‌లెత్తుతున్నాయి.

కానీ ఏదేమైనా టీఆర్ ఎస్ మాత్రం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌కుండానే వ్యూహాలు ప‌క్కాగా అమ‌లు చేస్తోంది.

మ‌రి అభ్య‌ర్థ‌ఙ లేకుండా ఇచ్చే హామీలు హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటాయా లేదా అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర‌లేపింది.

చూడాలి మ‌రి చివ‌ర‌కు ఏ పార్టీకి హుజూరాబాద్ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతారో.

మోదీకి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్..!!