యుద్ధ రాకెట్లతో అట్టుడికిన ఇజ్రాయెల్ దేశం..!!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ని జయించి .పౌరులకు మాస్కులు లేకుండా బయట తిరగవచ్చు అని చెప్పిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్.

అటువంటి ఈ దేశం పై 250 పెద్ద యుద్ధ రాకెట్లతో పాలస్తీనా పౌరులు విరుచుకుపడ్డారు.

ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకొని నిన్న సాయంత్రం 6 గంటల నుండి గాజా ప్రాంతం నుండి ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో చెదురుమదురు ఘటనలు మినహా ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.గత కొన్ని రోజుల నుండి పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

పైగా రెండు సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొనటంతో .

జరుగుతున్న యుద్ధ వాతావరణం బట్టి చూస్తే .ఇజ్రాయిల్ దేశాన్ని ఆదుకునేది ఎవరో అన్న తరహాలో అంతర్జాతీయ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

మొన్నటివరకు దేశ ప్రధానిగా రాణించిన బెంజమిన్ నెతన్యాహు … జరుగుతున్న ఎన్నికలలో పెద్దగా మెజార్టీ సాధించలేకపోయారు.

దీంతో ఇతర పక్షాల నుండి.మద్దతు కూడా గడుతున్న గాని పుష్కర కాలం నుండి.

బెంజమిన్ నెతన్యాహు కొనసాగుతూ ఉండటంతో చాలామంది ముందుకు రావటం లేదు.ఇటువంటి సమయంలో ఇజ్రాయెల్ దేశం పై పాలస్తీనా ప్రాంతానికి చెందిన వాళ్లు రాకెట్లతో విరుచుకుపడటంతో .

ఇజ్రాయెల్ దేశం యుద్ధ రాకెట్లతో అట్టుడికిపోతోంది. .

ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకు బీఆర్ఎస్..!