పాలేరు పంచాయతి.. తెగినట్లే ?

తెలంగాణ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని ఈసారి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గట్టి పట్టుదలగా ఉంది.

ప్రస్తుతం ఆ పార్టీ ఎప్పుడు లేనంతా జోష్ లో కనిపిస్తోంది.ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

అప్పటి నుంచి ఒకే టెంపో కొనసాగిస్తున్న హస్తం నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఇతర పార్టీల నేతలను గట్టిగానే ఆకర్షిస్తున్నారు.

అయితే పార్టీ ప్రస్తుతం ఎంత జోష్ లో ఉన్నప్పటికి సీట్ల పంపకల విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతోందట.

"""/" / ముఖ్యంగా పాలేరు సీటు కోసం ఉన్న పోటీ అంతా ఇంతా కాదు.

ఇప్పటికే పాలేరు సీటు కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy )గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇక ఇటీవల కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao ) కూడా పాలేరు సీటునే ఆశిస్తున్నారు.

అటు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరాలంటే పాలేరు సీటు కావాలనే కోరుతున్నారట.

దీంతో ఫైనల్ గా పాలేరు టికెట్ ఎవరికి ఇస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాలేరు సీటును తుమ్మల నాగేశ్వరరావుకే కేటాయించాలని డిసైడ్ అవుతున్నారట స్క్రినింగ్ కమిటీ సభ్యులు.

"""/" / ఇక ప్రస్తుతం పాలేరు రేస్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కొత్తగూడెం నుంచి బరిలో దించాలని చూస్తున్నారట.

ఇక వైఎస్ షర్మిల ( YS Sharmila )తన పార్టీ విలీనంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం ఆమె పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు కూడా తక్కువే అనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కే సీటు కేటాయించేందుకు సిద్దమౌతున్నారట.బి‌ఆర్‌ఎస్( Brs ) నుంచి పాలేరు సీటు ఆశించి భంగపడ్డ తుమ్మల కాంగ్రెస్ లో మాత్రం సీటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఈ సీటు పై బి‌ఆర్‌ఎస్ కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది.మరి బి‌ఆర్‌ఎస్ పోటీని తట్టుకొని ఈ నియోజిక వర్గంలో కాంగ్రెస్ సత్తా చాటుతుందో లేదో చూడాలి.

యూఎస్ ఆర్మీలోని ట్రాన్స్‌జెండర్స్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం?