కులాల అంతరం...కత్తుల సమరం! పలాస ట్రైలర్ టాక్

ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా యాస, భాషని సినిమాలలో కేవలం కామెడీ కోసం మాత్రమే ఉపయోగించారు.

అక్కడి వాతావరణం ప్రజల జీవనం, అక్కడ ప్రజల మధ్య కనిపించే ఆర్ధిక అసమానతలని దర్శకుడు ఎప్పుడు కూడా దృశ్యరూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.

అయితే మొదటి సారి పలాస నేపధ్యంలోనే సినిమా రాబోతుంది.అదికూడా పీరియాడికల్ రియలిస్టిక్ స్టొరీ కావడం ఇప్పుడు సినిమా మీద ఆసక్తి పెరిగేలా చేసింది.

ఇక సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా రిలీజ్ కాబోతూ ఉండటంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

కరుణ కుమార్ దర్శకత్వం పలాస 1978 అనే టైటిల్ తో 50 ఏళ్ల క్రితం పలాస పట్టణంలో జరిగిన ఒక నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో పీరియాడిక్ జోనర్ కి మంచి బజ్ వస్తుంది.

అందులో ఎమోషన్స్ ని ఎలివేట్ చేసే అవకాశం ఉండటంతో పాటు అప్పటి కల్చర్, వాతావరణం, కథలకి తెలుగు ప్రేక్షకులు భాగా కనెక్ట్ కావడంతో దర్శకులు ఈ జోనర్ నే టచ్ చేస్తున్నారు.

అలా వస్తున్న సినిమానే పలాస.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, కులాల అంతరం కారణంగా ప్రేమికులు ఎదుర్కొన్న సమస్యలు, తక్కువ జాతి వారిపై జమిందారుల పెత్తనంలాంటి ఎలిమెంట్స్ ఈ ట్రైలర్ గా దర్శకుడు ఆవిష్కరించాడు.

ట్రైలర్ లో క్రైమ్, రివెంజ్ లవ్, ఎమోషన్ కి దర్శకుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు.

దీనిని బట్టి సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనాకి రావచ్చు.ఇంచుమించు రంగస్థలం ఫ్లేవర్ లోనే కథ ఉన్న నేటివిటీ అంతా శ్రీకాకుళం నేపధ్యంలో ఉండటంతో ఆడియన్స్ కి కొత్తదనం అధించే అవకాశం ఉంది.

పెద్ద ప్లానే.. హాస్టల్ రూమ్ లోకి గర్ల్ ఫ్రెండ్ ను ఎలా తీసుకెళ్లాడంటే?!