కొల్లాపూర్ లో జరగాల్సిన పాలమూరు ప్రజాగర్జన సభ వాయిదా
TeluguStop.com
కొల్లాపూర్ లో ఎల్లుండి జరగాల్సిన పాలమూరు ప్రజాగర్జన సభ వాయిదా పడింది.కాగా ఈ సభకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
నేడు, రేపు నార్త్ ఇండియా, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనను వాయిదా వేశారు.ఈనెల 23 తరువాత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు.
ప్రియాంక గాంధీ సమక్షంలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరనున్న సంగతి తెలిసిందే.
మా లవ్ బ్రేకప్ అయింది.. వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్!