రోడ్డు ప్రమాదంలో పాలకుర్తి సీఐ దంపతులకు గాయాలు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: జాజిరెడ్డిగూడెం మండలం వెల్పుచర్ల గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో జనగామ జిల్లా పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి తన భార్యతో కలసి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ సూర్యాపేటలో బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా వెల్పుచర్ల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో కారు ఎదురుగా రావడంతో పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో సీఐ దంపతులకు గాయాలవ్వడంతో హుటాహుటిన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నన్ను క్షమించండి,చాలా పెద్ద తప్పు జరిగింది: శ్రీకాంత్ అయ్యంగార్