వేణుగోపాల స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం

ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి పురాతన ఆలయం నిర్మాణానికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సభలో దేవాలయం పునర్నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కెటిఆర్ ల పేరిటా ప్రత్యేక పూజలు అభిషేకం ఆలయ పూజారి వేణుగోపాల్ స్వామి నిర్వహించారు.

అనంతరం ఆలయం ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చాలా కాలంగా ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్న కళ నేరవేరిందన్నారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల వారు హార్షం వ్యక్తం చేశారు.

అదే విధంగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి రెండు కోట్లు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్ , బిఆర్ఎ‌స్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై పవన్ ప్రశంసలు.. ఆ దర్శకుడి డైరెక్షన్ లో నటిస్తాడా?