యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
TeluguStop.com
ఏదో సినిమాలో డైలాగ్ చెప్పిన విధంగా జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) రాజకీయాలను వదిలినా రాజకీయాలు ఎన్టీఆర్ ను మాత్రం వదలడం లేదు.
టీడీపీ ర్యాలీలలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తారక్ ఫ్లెక్సీలను ప్రదర్శించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లాలో( Chittoor District ) జరిగిన ఒక ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
టీడీపీ ( TDP ) ర్యాలీలో ఎన్టీఆర్ కు పాలాభిషేకం చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
ఆ ఎన్టీఆర్ అభిమానులు( NTR Fans ) బాబుకు భలే షాకిచ్చారుగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.మరో 12 రోజుల్లో ఏపీ ఎన్నికలు( AP Elections ) జరగనుండగా ఎన్నికల విషయంలో తారక్ సైలెంట్ గా ఉంటున్నా తారక్ అభిమానులు మాత్రం అస్సలు సైలెంట్ గా ఉండటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవర( Devara ) షూటింగ్ ను మే చివరినాటికి పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించే విధంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఏ సినిమాకు పడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడ్డారని సమాచారం అందుతోంది.
"""/" /
జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లకు సైతం దేవర మరపురాని సినిమాగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
దేవర1 సినిమాకు దేవర 2 సినిమాకు మధ్య గ్యాప్ ఉండనుందని తెలుస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ భారీ స్థాయిలో ఉండగా ఆ సినిమాలు భారీ సక్సెస్ అందుకుంటాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
తారక్ రాబోయే రోజుల్లో అయినా ఏపీ రాజకీయాల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.
పబ్లిక్‌లో రొమాన్స్.. పోలీసుల రియాక్షన్ ఇదే