సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సాబేరా బేగం ఆధ్వర్యంలో సోమవారం కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

రైతుల కండ్లలో ఆనందాన్ని చూస్తున్నామని, ఒకవైపు రెండు లక్షల రుణమాఫీ మరోవైపు 500 రూపాయల బోనస్ సంక్రాంతికి రైతు భరోసా ఇస్తానని చెప్పడం హర్షించదగ్గ విషయం అని అన్నారు.

రుణమాఫీ చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది అన్నారు.ఇది రైతు ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా నిలవడం జరుగుతుందన్నారు.

ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని బడుగు, బలహీన వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి, డైరెక్టర్లు గంట చిన్న లక్ష్మి, సూడిద రాజేందర్, నారాయణరెడ్డి,తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్,రవీందర్, కిష్టారెడ్డి,చెట్పల్లి బాలయ్య, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, నాయకులు చెన్నిబాబు, నందికిషన్,రవీందర్ రెడ్డి, అనవేని రవి,దత్తాత్రేయ గౌడ్, ఎండి హిమాం, నాగిరెడ్డి, చేపూరి రాజేషం,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్య 369 సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఆ విషయంలో డౌట్స్ అక్కర్లేదట!