రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం రాహుల్ గాంధీ ( Rahul Gandhi )చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లను పంపిణి చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై సూరత్ లక్నో కోర్టులలో రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసినందుకు సుప్రీంకోర్టుకు వెళ్లగా శుక్రవారం స్టే ఇవ్వడం జరిగిందన్నారు.
సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి న్యాయం జరిగిందని సత్యమేవ జయతే భారతదేశంలో నిలబడిందన్నారు.బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ పట్ల కక్షగట్టి ఇలా చేయడం జరిగిందని కానీ రాహుల్ గాంధీ సత్యమేవ జయతే నమ్మిన సిద్ధాంతం నిజం అయ్యిందన్నారు.
ప్రధానమంత్రి మోడీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన వాటన్నింటిని కూడా చేదించడం జరిగిందన్నారు.
ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం కళ్ళు తెరిచి రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించి రాహుల్ గాంధీకి కేటాయించిన బంగ్లా తిరిగి ఇవ్వాలన్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రతో వచ్చిన ఇమేజ్ పట్ల బిజెపి పార్టీ తట్టుకోవడం లేదన్నారు.
అటు కర్ణాటకలో విజయం రెండవసారి పాదయాత్రకు రాహుల్ గాంధీ బయలుదేరుతున్న తరుణంలో కోర్టు తీర్పు బిజెపి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,చెన్ని బాబు,గంటబుచ్చా గౌడ్,కొత్తపల్లి దేవయ్య, మామిండ్ల కిషన్, తిరుపతిరెడ్డి, తిరుపతి గౌడ్, లక్ష్మీ నరసయ్య, బిపేట రాజు,చెట్టుపెళ్లి బాలయ్య,సోనవేని రాజయ్య, సిరిసిల్ల సురేష్,సిరిపురం మహేందర్ ,కోనేటి పోచయ్య, ఎండి రఫీక్, చెరుకు ఎల్లయ్య, గుర్రం రాములు,రాజు నాయక్, రాజేందర్,కటిక రవి, మేడిపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సెల్ఫీ పిచ్చితో కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి.. చివరకి?