తొలిసారి రియాక్ట్ అయిన స్మృతీ మంధాన బాయ్‌ఫ్రెండ్.. ఏమన్నాడంటే..
TeluguStop.com
ప్రముఖ క్రికెటర్ స్మృతీ మంధాన,( Smriti Mandhana ) సంగీత దర్శకుడు, దర్శకుడు పలాష్ ముచ్చల్( Palaash Muchhal ) ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా హల్చల్ చేస్తున్నాయి.
ఈ జంట తమ సంబంధాన్ని సీక్రెట్ గా ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా, వుమెన్స్ ప్రీమియర్ లీగ్( WPL ) లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( RCB ) కెప్టెన్‌గా ఉన్న స్మృతీ మంధానను పలాష్ కలిసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
చివరకు, ఈ సంవత్సరం జూలైలో, స్మృతీ, పలాష్ తమ ఐదేళ్ల ప్రేమ సంబంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
"""/" /
అయితే తాజాగా పలాష్ తొలిసారిగా తమ సంబంధం గురించి మాట్లాడారు.
తమ ప్రేమను ప్రజల దృష్టి నుంచి దూరంగా ఉంచడానికి కారణాన్ని ఆయన వివరించారు.
పలాష్ తనను తాను చాలా సిగ్గరిగా, ఇంట్రోవర్ట్ గా పరిచయం చేసుకున్నారు.చాలా మంది స్నేహితులు ఉన్నప్పటికీ, స్టేజ్‌పై పెర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ తాను ఇలా ఉండటం చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పారు.
"నా సోషల్ లైఫ్ చూసి చాలామంది నమ్మరు, కానీ ఈవెంట్స్ లేదా పార్టీలకు వెళ్లినప్పుడు కూడా ఫోటోలకు పోజ్ ఇవ్వడానికి నేను చాలా సిగ్గు పడుతాను" అని పలాష్ పేర్కొన్నారు.
"""/" /
పలాష్ తన వ్యక్తిగత జీవితం ఇలా అకస్మాత్తుగా నెట్టింట హాట్ టాపిక్ అయినప్పుడు తాను ఎంతగా ఇబ్బంది పడ్డారో కూడా తెలిపారు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్( WPL ) సమయంలో స్టేడియంలో స్మృతిని కలిసినప్పుడు తనను ఫిల్మ్ చేస్తున్నారని తనకు తెలియదని చెప్పారు.
"ఆ సమయంలో నేను కెమెరా ముందున్నానని నాకు తెలియదు.తెలిసి ఉంటే ఫీల్డ్‌లోకి వెళ్లి ఉండేవాడిని కాదు.
కానీ ఇప్పుడు అది ఎక్కడ చూసినా కనిపిస్తోంది" అని పలాష్ పేర్కొన్నారు.తన షోలలో కూడా ప్రజలు స్మృతితో తన సంబంధాన్ని ఉద్దేశించి "RCB" అని కేకలు వేస్తుండటం వల్ల వారి వ్యక్తిగత జీవితం మరింత వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు.
వావ్.. ఇది కదా అసలైన రోహిత్ శర్మ.. హృదయాలను గెలుచుకున్నాడుగా