ఇక నుండి సీరియల్స్ లో ముద్దులు, కౌగిలింతలు కట్..!

ప్రేక్షకులకు వెండితెర ఎంత వినోదం అందిస్తుందో.బుల్లితెర కూడా అంతకంటే ఎక్కువనే వినోదాన్ని పంచుతూ ప్రతి రోజు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటుంది.

నిజానికి ముందు కంటే ఇప్పుడు టెలివిజన్ రంగం బాగా అభివృద్ధి చెందింది.ఇంతకు ముందు వారానికి ఒక సినిమా, రోజు కనిపించే డైలీ సీరియల్స్ తప్ప టెలివిజన్ లో మరొకటి వచ్చేది కాదు.

కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో టెలివిజన్ రంగం కూడా చాలా ముందుకు వెళ్ళింది.

రోజు కొత్త సినిమాలతో, విభిన్నమైన సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది.

టీవీ ఛానెల్స్ ముఖ్యంగా ఆడవాళ్లకు మంచి వినోదం అందిస్తున్నాయి.ఆడవాళ్లు ఎక్కువుగా చూసే వాటిలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయనే చెప్పాలి.

వీటి కోసం రోజు ఆ సమయానికి ఆతృతగా ఎదురు చూస్తారు.అయితే సీరియల్స్ కూడా ట్రెండ్ మారుస్తున్నాయి.

ఇంతకు ముందు చక్కగా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరగా కలిసి కూర్చుని చూసే విధంగా ఉండేవి.

కానీ ఇప్పుడు ఎలా కాదు.సినిమాల్లో లాగా కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోతున్నారు.

ఇవి సీరియల్స్ నా లేదంటే సినిమాల అని అనుకునే విధంగా ఉంటున్నాయి.అందుకే ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉండి సీరియల్స్ ను చూడలేక పోతున్నారు.

ఈ సీరియల్స్ ప్రభావం ఇంట్లో గృహిణుల మీద, యువత మీద ఎక్కువ చూపుతోంది.

అందుకే పాకిస్థాన్ ప్రభుత్వం ఇలాంటి సీరియల్స్ మీద ద్రుష్టి పెట్టింది.ఇక నుండి టీవీ సీరియల్స్ లో ముద్దులు కానీ, కౌగిలింతలు కానీ.

సన్నిహిత దృశ్యాలు కానీ ఉండకూడదని అలాంటి దృశ్యాలను చేయడం నిలిపి వేయాలని పీఈఎంఆర్ఏ టీవీ చానళ్లకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఇలాంటి సీన్లు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నామని పాక్ ప్రభుత్వం తెలిపింది.

ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు..!