భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే?

భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా అసలు ఏం జరిగిందంటే?

పాకిస్థాన్‌కు(Pakistan) చెందిన ఒక వ్యాపారవేత్త చేసిన పని ఇప్పుడు అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది.

భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా అసలు ఏం జరిగిందంటే?

అతడు ఇండియన్ వీసా లేకుండానే ఇండియాకి (India Without An Indian Visa)వచ్చేశాడట.

భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా అసలు ఏం జరిగిందంటే?

వినడానికి ఇది చట్టవిరుద్ధంగా అనిపించినా, నిజానికి ఇది పూర్తిగా చట్టబద్ధమేనట.ఆ వ్యాపారవేత్త పేరు వకాస్ హసన్.

ఈయనే 'ఏఐఫర్ఆల్'(AiForAll) అనే కంపెనీ ఫౌండర్.సింగపూర్ నుండి సౌదీ అరేబియాకి (Singapore To Saudi Arabia)ఇండిగో ఫ్లైట్‌లో వెళ్తూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆరు గంటలు ఆగాడు.

కనెక్టింగ్ ఫ్లైట్ కావడంతో వీసా లేకుండానే ఇండియాలో అడుగుపెట్టాడు.ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) వీడియో పెట్టి మరీ చెప్పడంతో రెండు దేశాల ప్రజలు అవాక్కయ్యారు.

పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్లు కనెక్టింగ్ ఫ్లైట్‌లో వెళ్తూ ఇండియాలో ఆగితే వీసా లేకుండానే ప్రయాణించొచ్చు.

కానీ ఒక్క కండిషన్ ఏంటంటే, ఎయిర్‌పోర్ట్ బయటికి మాత్రం వెళ్లకూడదు.అంటే లగేజీ తీసుకుని మళ్లీ చెక్-ఇన్ చేసుకునే ఫ్లైట్స్ పాకిస్థానీలకు కుదరవు.

డైరెక్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ అయితేనే ఈ రూల్ వర్తిస్తుంది.వీడియోలో వకాస్ హసన్ మాట్లాడుతూ.

ఈ విషయం తనకే షాకింగ్‌గా అనిపించిందని చెప్పాడు.ముంబై ఎయిర్‌పోర్ట్ (Mumbai Airport)సిబ్బంది కూడా తన పాకిస్థాన్ పాస్‌పోర్ట్ చూసి ఆశ్చర్యపోయారట.

పాకిస్థానీలు ఇండియా మీదుగా ట్రాన్సిట్ అవ్వడం చాలా అరుదు. """/" / ఎయిర్‌పోర్ట్ బయటికి వెళ్లలేకపోయినా, వకాస్ మాత్రం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఫుల్ ఎంజాయ్ చేశాడు.

లాంజ్‌లో రిలాక్స్ అయ్యాడు, కొన్ని గిఫ్ట్స్ కొనుక్కున్నాడు.అంతేనా ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడా పావ్ కూడా టేస్ట్ చేసేశాడు.

ఈ ఎక్స్‌పీరియన్స్ మొత్తం "చాలా సరదాగా" అనిపించిందని చెప్పాడు వకాస్.వకాస్ ఇండిగో ఫ్లైట్ ఎంచుకోవడానికి కారణం కూడా చెప్పాడు.

సింగపూర్ నుంచి సౌదీ అరేబియా లాంటి ఈస్ట్ నుండి వెస్ట్ రూట్స్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలు తక్కువగా ఉంటాయట.

అందుకే కొంచెం రిస్క్ అయినా తీసుకుని ఇండిగోలో ప్రయాణించానని, కానీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం బాగుందని అన్నాడు.

"""/" / వకాస్ వీడియో పెట్టిన వెంటనే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

కొందరు వకాస్ సాహసాన్ని మెచ్చుకుంటూ ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రయాణాలు సులువుగా ఉండాలని కామెంట్స్ పెట్టారు.

ఇంకొందరేమో ఎయిర్‌పోర్ట్ బయటికి వెళ్లడానికి వీల్లేనప్పుడు ఇండియాకు వచ్చి ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా వకాస్ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డబ్బు కోసం చైనీస్ మహిళ వింత పని.. తెలిస్తే దిమ్మతిరుగుతుంది!

డబ్బు కోసం చైనీస్ మహిళ వింత పని.. తెలిస్తే దిమ్మతిరుగుతుంది!