పెంపుడు పులిని పబ్లిక్‌లోకి తీసుకొచ్చిన పాకిస్థాన్ వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్…

పులులు అడవి జంతువులు.అవి చాలా క్రూరమైనవి.

జనావాసాల్లో వాటిని అస్సలు ఉంచకూడదు.ఉంచినా ఒక బోను లాంటి దానిలో వేసి ఉంచాలి.

లేదంటే చుట్టూ కంచి వేసి వాటిని పెంచాలి.కానీ ఒక వ్యక్తి ఇటీవల రద్దీగా ఉండే వీధిలోకి గొలుసులతో ఓ పులిని తీసుకొచ్చాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.'టిప్‌టాప్‌యాత్ర' ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ ఖైబర్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించడం చూడవచ్చు.

దీన్ని బట్టి ఈ ఘటన పాకిస్థాన్‌కు చెందినదని తెలుస్తోంది. """/" / పులి గొలుసు నుంచి విడిపించుకుని పారిపోవడానికి కష్టపడుతున్నట్లు వీడియోలో కనిపించింది, దాని యజమాని దానితో సాధారణం నడుచుకుంటూ వెళ్తాడు.

ఆ పులి రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పంజా విసురుతూ దాడికి కూడా పాల్పడింది.

ఈ పులి వీధిలో కనిపించడంతో ప్రజల భద్రత, పులి క్షేమం ప్రశ్నార్థకమైంది.చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ వీడియోపై తమ ఆందోళన వ్యక్తం చేశారు.

"""/" / భద్రత, సంరక్షణ కోసం అడవి జంతువులను పెంపుడు జంతువుగా పెంచడం సాధారణంగా నేరం.

రోడ్లపైకి తీసుకురావడం చాలా ప్రమాదకరం.కానీ సదరు యజమాని మాత్రం అన్ని బ్రేక్స్ రూల్ చేశాడు.

ఆ పులి చూసేందుకు పెద్దగానే ఉంది అది తలుచుకుంటే అతడిని కింద పడేసి అతన్నించి విడిపించుకుని పారిపోయే ప్రమాదం ఉంది.

అది బిజీ రోడ్డు కావడంతో ఎవరూ ఒకరిపై దాడి చేసి చంపేసే ఛాన్స్ కూడా ఉంది.

ఏమాత్రం తేడా వచ్చినా మనుషులను చీల్చి చండాడేసే పులిని పట్టుకొని అతను తిరగడం అందర్నీ షాక్ గురి చేస్తోంది.

ఇతనిపై పోలీసులు చర్య తీసుకున్నారా లేదా అనేది తెలియ రాలేదు కానీ ఆన్‌లైన్‌లో మాత్రం బాగా తిట్లు తింటున్నాడు.