మన దేశస్థుడి కోసం పాక్ న్యాయస్థానంలో పోరాడుతున్న పాక్ పౌరుడు..

మనదేశంలోని కేరళ రాష్ట్రం నుంచి సౌదీ అరేబియాలోని కాలి నడకన వెళుతున్న వ్యక్తి కోరినట్లు ట్రాన్సిట్ విసా ఇవ్వాలని పాకిస్తాన్ కు చెందిన ఒక వ్యక్తి ఆ దేశ సుప్రీంకోర్టును కోరాడు.

కేరళలోని తన సొంత నగరం నుంచి 8600 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి హజ్ లో ప్రార్థనలు చేయాలని తన ప్రయాణాన్ని పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ మరియు కువైట్ మీదుగా వెళ్లాలని బయలుదేరాడు.

29 సంవత్సరాలు ఉన్న మన భారతీయ పౌరుడు దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరం నడిచి వాఘ సరిహద్దు వరకు చేరుకున్నాడు.

అక్టోబర్లో వాఘా సరిహద్దు దగ్గరకు చేరగానే పాకిస్తాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.అప్పుడు ఆ వ్యక్తి తను కాలినడకన హాజ్ యాత్రకు వెళుతున్నానని మానవతా దృక్పథంతో దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరాడు.

ఇరాన్ మీదుగా సౌదీ అరేబియా చేరుకోవడానికి తనకు ట్రాన్సిట్ వీసా కావాలని కోరాడు.

అయితే అధికారులు అనుమతించకపోవడంతో, అతడికి ట్రాన్సిట్ వీసా ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్  పౌరుడు సర్వర్ తాజ్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

భారతీయ పౌరుడి పూర్తి వివరాలను పిటిషనర్ ఇవ్వలేదని పైగా పిటీషనర్ ఆ భారతీయ పౌరుడికి బంధువు కూడా కాదని చెబుతూ లాహోర్ హైకోర్టు అతని పిటిషన్ ను కొట్టివేసింది.

"""/"/ తన పిటషన్ను కొట్టివేసిన లాహోర్ హైకోర్టు నిర్ణయాన్ని పాక్ పౌరుడు బుధవారం సుప్రీంకోర్టులో సవాలు చేశాడు.

భారతదేశ వ్యక్తి హజ్ కోసం సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్ళేందుకు పాకిస్తాన్లోకి ప్రవేశించాలనుకుంటున్నాడని గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా మరియు ఇతర ఎన్నో సందర్భాలలో దేశంలోని పవిత్ర స్థలాలను సందర్శించడానికి పాక్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో భారతీయ సిక్కులకు వీసాలు మంజూరు చేస్తుందని అదేవిధంగా ఈ భారతీయ పౌరుడికి కూడా ట్రాన్సిట్ వీసా ఇవ్వాలని తన పిటిషన్ లో వాదించాడు.

షాపింగ్ చేసే డిజార్డర్.. ఈ యువతి ఇంటి నిండా తెరవని బాక్సులు..?