గాల్లో చక్కర్లు కొడుతూ నేల కూలిన శిక్షణ విమానం,17 మంది మృతి

పొరుగుదేశం పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఒక సైనిక శిక్షణ విమానం కూలిపోవడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పైలట్లు సహా 17 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.

రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు జవాన్లు,12 మంది పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అలానే ఈ ఘటనలో మరికొందరు గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు,దీనితో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది.

శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం గాలిలో చక్కర్లు కొడుతున్న సమయంలో కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయిన విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రావల్పిండి నగర శివారులోని నివాస సముదాయాల్లో కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది.

"""/"/ అయితే అసలు ఈ ప్రమాదానికి గల కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.

నివాస ప్రాంతాల్లో విమానం చక్కర్లు కొట్టి కూలిపోవడం తోనే మృతుల సంఖ్య పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఘటనాస్థలిలో ఇంకా మంటలు చెలరేగుతుండడంతో సిబ్బంది సహాయక చర్యల్లో చేపడుతున్నట్లు తెలుస్తుంది.

Pakistan Army Plane Crash Near Rawalpindi 2 Attachments .

పవన్ కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల స్టార్ పొజిషన్ కి వెళ్ళిన వారు వీళ్లేనా..?