రుణం ఇవ్వండి ప్లీజ్.. తెగ తిప్పలు పడుతున్న పాకిస్తాన్

ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక సంక్షోభంలో( Financial Crisis ) కూరుకుపోయాయి.ఆర్ధిక మాద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఇప్పటికే శ్రీలంక అప్పుల్లో కూరుకుపోవడంతో ఆర్ధిక కష్టాల్లో పడి ప్రభుత్వం దివాళా తీసింది.

ఇప్పుడు శ్రీలంక పరిస్థితి పాకిస్తాన్( Pakistan ) కూడా ఎదుర్కొంటుంది.పాకిస్తాన్ ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కొంటుంది.

ఆర్దిక పరిస్థితులు దిగజార్చడంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.దీంతో సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.

"""/" / అయితే ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అప్పులు తెచ్చుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది.

పాకిస్తాన్ రుణాల కోసం అనేక తిప్పలు పడుతోంది.పన్ను ద్వారా 215 బిలియన్లు పాకిస్తాన్ వసూలు చేస్తోంది.

2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేవలం 215 బిలియన్లు లేదా దాదాపు 750,400,000 యూఎస్ డాలర్లు మాత్రమే తుది పన్నుగా నిర్ణయించినట్లు పాకిస్తాన్ ఆర్ధికశాఖ మంత్రి ఇసాక్ దార్( Ishaq Dar ) స్పష్టం చేశారు.

అలాగే ఐఎంఎఫ్ ( IMF ) ద్వారా రుణం తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నామని, ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నామని తెలిపారు.

"""/" / కొన్ని రోజుల క్రితం ఐఎంఎఫ్ ఎండీ క్రిస్తాలినా జార్జివాతో( IMF Chief Kristalina Georgieva ) పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చర్చలు జరిపారు.

పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి, రుణాల సేకరణ విషయం గురించి మాట్లాడారు.అయితే ఐఎంఎఫ్ మద్దతు లేకుండా ఇతర దేశాల నుంచి రుణాలు పొందటం కష్టంగా మారే అవకాశముంటుందని పాకిస్తాన్ భయపడుతోంది.

అందుకే ఐఎంఎఫ్ మద్దతను కోరుతోంది.అలాగే గ్లోబల్ టెండర్లు కొన్ని షరతులతో పాకిస్తాన్ కు 6 బిలియన్ల యూఎస్ డాలర్లు ఇచ్చేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.

దీంతో త్వరలోనే పాకిస్తాన్ కు భారీగా రుణాలు అందనున్నాయి.ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు, పెన్షన్లు ఇస్తామని, ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

కేంద్రాన్ని ఒప్పించిన బాబు … అమరావతికి మహర్దశ