సంఘౌత్ ఎక్స్ ప్రెస్ లో బాంబు దాడి కేసు! ఇండియన్ హై కమిషన్ కి పాకిస్తాన్ నోటీసులు

ఇండియా- పాకిస్తాన్ మధ్య నడిచే సంఝౌత్ ఎక్స్ ప్రెస్ పై బాంబి దాడి కేసులో ముద్దాయిలుగా కోర్టులో శిక్ష అనుభవిస్తున్న వారిని ఎన్ఐఎ కోర్ట్ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో సరైన సాక్ష్యాలు చూపించని కారణంగా నిందితులుగా ఉన్న అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

సంఝౌత్ ఎక్స్ ప్రెస్ పై భాంబు దాడిలో అప్పట్లో పాకిస్తాన్ కి చెందిన ప్రయాణికులు చాలా మంది చనిపోయారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో న్యాయస్థానం తీర్పుపై ఇప్పుడు పాకిస్తాన్ హై కమిషన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఇండియన్ హై కమిషన్ కి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసు విచారణ ఎందుకు సరైన పద్దతిలో చేసి నిందితులకి శిక్ష పడేలా చేయలేదు అని నోటీసులలో ప్రశ్నించింది.

అయితే దీనికి భారత్ హై కమిషన్ తిరిగి కౌంటర్ ఇచ్చింది.ముంబై టెర్రర్ ఎటాక్ కి కారణం ఎవరో ఆధారాలు ఇచ్చిన కూడా మీరు ఎందుకు టెర్రరిస్ట్ లకి క్లీన్ చీట్ ఇచ్చారో చెబితే మేము కూడా సమాధానం చెబుతామని చెప్పుకొచ్చారు.

వైరల్ వీడియో: వెరైటీగా కనపడ్డ రాయి.. తవ్వి చూడగా ఏకంగా..