భారత్ ను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం,మసూద్ విడుదల!

జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 ని మోడీ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆర్టికల్ రద్దు చేసినప్పటి నుంచి పొరుగుదేశం పాకిస్థాన్ భారత్ పై ఎప్పటికప్పుడు విషం కక్కుతూనే ఉంటుంది.

ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ ని పాక్ విడుదల చేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

మసూద్ అజార్ ని ఉగ్రవాది గా భారత ప్రధాని మోడీ సర్కార్ గుర్తించిన విషయం తెలిసిందే.

అయితే భారత్ పై దాడులకు కుట్ర పన్నుతూ ఇలా మసూద్ ని విడుదల చేసినట్లు ఇంటలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు పాక్ రేంజర్లు కూడా సరిహద్దుల్లో దాడులకు దిగుతున్నారు.ఇంకోవైపు దాదాపు 200 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా మసూద్ ని విడుదల చేసి మరో భారీ కుట్రకు ఆ దేశం పావులు కదుపుతున్నట్లు ఇంటలిజెన్స్ భావిస్తుంది.

గతంలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అరెస్టు చేసిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.

అతడ్ని రహస్యంగా విడుదల చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందడం తో ఐబీ వర్గాలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి.

"""/"/  ఈ క్రమంలో రాజస్థాన్-కాశ్మీర్ సెక్టార్లలో భారీ కుట్రకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, అందుకే.

ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేసేందుకు రెండ్రోజుల క్రితం అజార్‌ను విడుదల చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పంజాబ్‌, రాజస్థాన్‌, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలను అప్రమత్తం చేయాలని ఈ సందర్భంగా ఐబీ సూచించినట్లు తెలుస్తుంది.

భారీ ధరలకు చైతన్య తండేల్ డిజిటల్ రైట్స్ కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!