730 రోజులు సెలవు తో పాటు సాలరీ కావాలట.. వైరల్ గా మారిన ప్రభుత్వ ఉద్యోగి ..లీవ్ లెటర్..

లీవ్ లెటర్.స్కూల్ లో ఉన్నప్పుడు రాయడమే తప్ప తరవాత దానితో మనకి పెద్ద అవసరం పడలేదు అనుకుంట.

స్కూల్ కి వెళ్లలేకపోతే రకరకాల కారణాలు చెప్పి లీవ్ లెటర్ రాసే వాళ్ళం.

ఎక్కువగా కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం అని రాసేవాళ్ళు.ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో అంటే లీవ్ లెటర్ లతో పెద్దగా పరిచయం లేదు ఎందుకంటే అన్ని మెయిల్ లోనే జరిగిపోతాయి.

పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉన్నతోద్యోగి రాసిన లీవ్‌ లెటర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఎందుకంటే అతను 730 రోజులు సెలవులు కావాలని అడిగాడు.మాములుగా సెలవు అంటే పందగ్గో పబ్బానికో మహా అంటే మూడు నాలుగు రోజులు అనుకోవచ్చు.

లేదంటే ఆరోగ్యం బాలేదు అనుకోవచ్చు.అతనికి సెలవుతో పాటు ఫుల్ శాలరీ కూడా కావలి అంట.

దానికి ఓ కారణం కూడా ఉంది అంట.! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పాకిస్థాన్‌‌లో రైల్వే ఉద్యోగి మహమ్మద్‌ హనీఫ్‌ గుల్‌‌ ‘వర్క్‌ పర్‌ఫెక్ట్‌’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారట.

కొందరు సహోద్యోగులు ఆయన పనితీరుకు అసూయ పడితే మరి కొందరేమో ‘హింస రాజు’ అంటూ తిట్టుకుంటారట.

పాక్ రైల్వే శాఖకు షేక్‌ రషీద్ అహ్మద్‌ ఇటీవల కొత్త మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే."ఆయన పని తీరు హనీఫ్‌కు నచ్చలేదట.

‘రైల్వే శాఖ నూతన మంత్రికి వృత్తి పట్ల నిబద్ధత లేదు.అసలు ఆయనకు రైల్వే మంత్రికి కావాల్సిన నైపుణ్యాలు లేవు.

ఆయనతో కలిసి పనిచేయలేను’ అని హనీఫ్ లేఖలో పేర్కొన్నారు." Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ దీంతో హనీఫ్ రెండేళ్లు సెలవు పెట్టాలని భావించారట.

వెంటనే 730 రోజులు సెలవు కావాలంటూ లేఖ రాశారు.దీనిపై హనీఫ్ వివరణ కోరగా.

అప్పటికైనా మంత్రిగారి పని తీరులో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారట.

పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్‎లో విభేదాలు