భారత ప్రధానికి పాక్ ప్రధాని లేఖ.. అందులో ఏముందంటే..?!

ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధపోరు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుది.ఇక ఈ రెండు దేశాల మధ్య వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని ఇరు దేశాల్లోని ప్రజాస్వామిక వాదులు ఎదురుచూస్తున్నారు.

ఇక రెండు దేశాల మధ్య ఎప్పడు సమస్యలు తలెత్తునే ఉంటాయి.సమస్యలకు శాంతియుత చర్చలు జరపడం అవి విఫలం అవడం సహజగనే మారింది.

తాజాగా భారత ప్రధాని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి లేఖ పంపడం పట్ల ఆసక్తిగా మారింది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

పాకిస్తాన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ జమ్మూకాశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు.భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.

అయితే పాకిస్తాన్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పాక్ ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే.

దీనికి ప్రతిస్పందనగా ఇమ్రాన్ లేఖ రాశారు.స్వేచ్ఛా, సామర్థ్యాలతో కూడిన స్వతంత్ర్య, సార్వభౌమ రాజ్యానికి ముందుచూపుతో పునాదులు వేసిన మా జాతి పితలను గుర్తు చేసుకుని, నివాళులు అర్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని ఇమ్రాన్ తెలిపారు.

"""/"/ భారత్ సహా పొరుగు దేశాలన్నిటితోనూ పాకిస్తాన్ ప్రజలు శాంతి, పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాలు, జమ్మూకాశ్మీర్ వివాదానికి ముగింపు పలికితేనే దక్షిణ ఆసియాలో శాంతి, సుస్థిరత సాధ్యం అవుతాయని తెలిపారు.

చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.అంతేకాదు.

కరోనా వైరస్ మహమ్మారిపై భారతదేశ ప్రజలు అద్భుతంగా పోరాడుతున్నారంటూ ఇమ్రాన్ కొనియాడుతూ లేఖలో రాశారు.

అయితే గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల సంఘటనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

పాక్ నుంచి వస్తున్న ముష్కరమూకలకు భారత సైన్యం ధీటుగా సమాధానమిస్తోంది.జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసందే.

పవన్ చదువును మధ్యలో ఆపేయడానికి అసలు కారణమిదా.. అసలేమైందంటే?