గోల్డ్ మెడలిస్ట్ నదీమ్‌కు గిఫ్ట్‌గా బర్రె ఇచ్చాడు.. ఎవరో తెలిస్తే!
TeluguStop.com
పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్( Arshad Nadeem ) పారిస్ ఒలింపిక్స్‌లో( Paris Olympics ) జావెలిన్ త్రో పోటీలో బంగారు పతకం( Gold Medal ) గెలిచి చరిత్ర సృష్టించాడు.
ఈ అథ్లెట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు.ఈ పోటీలో ఇండియన్ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పోటీ పడి గెలిచాడు.
అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు.
బంగారు పతకం గెలిచిన తర్వాత అర్షద్ నదీమ్‌కు చాలా బహుమతులు లభించాయి.ఆయనకు 50,000 అమెరికన్ డాలర్లు అంటే భారతీయ రూపాయల్లో దాదాపు 41 లక్షల 97 వేల 552 రూపాయలు బహుమతిగా ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఆయన మామ అర్షద్‌కు ఒక గేదెను( Buffalo ) బహుమతిగా ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
అర్షద్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడు కాబట్టి గేదె బహుమతి ఆయనకు బాగా సరిపోతుందని, ఇదే గ్రామ సాంప్రదాయమని అతని మామ( Father-In-Law ) చెబుతున్నారు.
ఈ బర్రె సంపద, సంతోషానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన మీడియాతో చెప్పారు. """/" /
స్థానిక మీడియా ప్రకారం, నదీమ్ గ్రామంలో ఒక ఆచారం ఉంది.
అదేంటంటే, ఎవరైనా గొప్ప పని చేస్తే వారికి గేదెను బహుమతిగా ఇస్తారు.అది చాలా గొప్ప విషయంగా భావిస్తారు.
అందుకే నదీమ్ మామ ఆయనకు గేదెను బహుమతిగా ఇచ్చారు.నదీమ్ తన గ్రామాన్ని ఎంతో ఇష్టపడతాడు.
ఎంతో పేరు సంపాదించినా కూడా ఇప్పటికీ తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు.
"""/" /
నదీమ్ మామకు నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.వారిలో చిన్నమ్మాయి అయిన ఆయిషాను నదీమ్ కు ఇచ్చి పెళ్లి చేశారు.
నదీమ్, ఆయిషా దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు.నదీమ్ పంజాబ్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు.
చిన్నప్పుడు క్రీడలు ఆడేవాడు.మంచి ప్రతిభ ఉంది కాబట్టి నదీమ్‌కు గ్రామస్తులు, బంధువులు అందరూ కలిసి డబ్బులు సేకరించి ఆయనకు ఇచ్చేవారు.
అలా ఈ గోల్డ్ మెడలిస్ట్ విదేశాలకు వెళ్లి పోటీలు చేసేవాడు.
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత… అదే నా కోరిక అంటూ?