వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం అవుతోన్న పాకిస్థాన్

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో పాకిస్థాన్ అత‌లాకుత‌లం అవుతోంది.ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

గ‌డిచిన 24 గంట‌ల్లోనే 119 మంది ప్రాణాలు కోల్పోయార‌ని పాకిస్థాన్ జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ అథారిటీ తెలిపింది.

అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,456 మంది గాయ‌ప‌డిన‌ట్టు వెల్ల‌డించారు.పాకిస్థాన్ లో వ‌ర్షాకాలంలో స‌గ‌టు వ‌ర్ష‌పాతం 132.

3 మిల్లీమీట‌ర్లు కాగా, ఈ ఏడాది జూన్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 192 శాతం అధికంగా 385.

4 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది.ఈ స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌డం గ‌త 30 సంవ‌త్స‌రాల‌లో ఇదే తొలిసార‌ని పేర్కొంది.

దేశ‌వ్యాప్తంగా 3.30 కోట్ల మందిపై వ‌ర‌ద‌లు ప్ర‌భావం చూపాయి.

భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి.దేశంలోని 149 వంతెన‌లు కొట్టుకుపోవ‌డంతో.

ప‌లు ప్రాంతాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.ఈ క్ర‌మంలో వ‌ర‌ద బాధితుల‌కు సాయం అందించేందుకు రంగంలోకి దిగిన సైన్యం.

స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.

మంచు విష్ణు కన్నప్ప బిజినెస్ పరంగా ఓకే మరి సక్సెస్ పరంగా ఏం చేయబోతున్నాడు…