భారత్‌ ఐడియాలజీని ఫాలో అవుతున్న పాకిస్తాన్‌.. రష్యాతో బేరానికి దిగిన వైనం!

అవును, మీరు విన్నది నిజమే.ఇపుడు రష్యా ( Russia )దగ్గర పాకిస్తాన్( Pakistan ) ఆయిల్ కొనాలనుకుంటుంది, అచ్చం భారత్ మాదిరి.

రష్యా దానికి పచ్చజెండా కూడా ఊపేసింది.అయితే ఇక్కడే వుంది అసలు ట్విస్ట్.

భారత్ కి ఇచ్చే ధరకే తమకు ఇవ్వాలన్నట్లుగా పాకిస్తాన్ రష్యాకి కండిషన్ పెట్టిందని గుసగుసలు వినబడుతున్నాయి.

రష్యాకు చైనా స్నేహితుడు.అలాగే పాకిస్తాన్ కు చైనాకు మంచి స్నేహ బంధం ఉంది.

ఆ స్నేహం ఇక్కడ వర్కవుట్ అవుతందనే ఆశ పడుతున్నట్టు ఇక్కడ సుస్పష్టం అవుతోంది.

"""/" / అయితే, అలా ఎక్కువ ఊహించుకున్న పాకిస్థాన్ ఆశలుపై రష్యా నీళ్లు చల్లినట్టు భోగట్టా.

ఎందుకంటే ఈ డీల్ రష్యాకి ఏమంత్రం రుచించలేదు.పైగా భారత్, రష్యా( India , Russia ) బంధం ఈనాటిది కాదు.

అలా ఇండియాతో కంపేర్ చేసుకోవద్దని పాక్ కి సుతారంగా వార్నింగ్ ఇచ్చిందట రష్యా.

అయితే ఇండియాకి ఇచ్చిన ధర గిట్టుబాటు కుదరదు గానీ, ఓ మంచి ఫిగర్ రష్యా చెప్పినట్టు వినబడుతోంది.

తాజాగా షర్గోవ్ ( Shargov )ఇండియాకి రావడం, పాకిస్తాన్ మంత్రి బిలావర్ బుట్టో జర్దారి( Bilawar Bhutto Zardari ) కూడా ఇండియాకి రావడం జరగడంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది.

"""/" / దాని ప్రకారం 7,50,000 బారెళ్ళు పాకిస్తాన్ కు రష్యా అమ్మడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

పాకిస్తాన్ చైనా కరెన్సీ యువాన్స్ లో పే చేయడానికి రెడీ అయ్యిందట.ఈ నేపథ్యంలో మొదటి కార్గో ఏడు లక్షల 50 వేల బారెల్స్ తో రాబోతుందని తెలుస్తుంది.

కాగా ఆ కార్గో జూన్ నాటికి పాకిస్తాన్ చేరుకుంటుంది.దీనికి గాను పాకిస్తాన్ ఒక్కొక్క బ్యారెల్ కి 50 నుండి 52 డాలర్లు, అంటే 60 డాలర్ల లోపే చెల్లించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది.

కాగా భారతదేశానికి 45 డాలర్లకి ఇస్తుంది రష్యా.

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?