క్రికెట్ కి గుడ్‌బై చెప్పిన మరో స్టార్ క్రికెటర్ !

పాక్ క్రికెటర్ ఉమర్ గుల్ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు.క్రికెట్ లో ఉన్న అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు తన నిర్ణయాన్ని చెప్పిన ఈ 36 ఏళ్ల గుల్.

ఇన్నేళ్లుగా తన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు.

తాను క్రికెట్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, ముఖ్యంగా నిబద్ధత, కృషి, సంకల్పం, విలువలు వంటివి క్రికెట్ తనకు నేర్పించింది అని తెలిపాడు.

ఇక క్రికెటర్ గా ఇన్నేళ్ల తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు.

తన కోసం ఎంతో త్యాగం చేసిన అభిమానులే తనకు స్ఫూర్తి అని, ఇక పై వారిని చాలా మిస్ అవుతానని తెలిపాడు.

ఉమర్ గుల్ క్రికెట్ జీవితాన్ని చూస్తే .జింబాబ్వేతో 2003లో జరిగిన మ్యాచ్‌ తో వన్డేల్లో అడుగుపెట్టిన ఈ పేసర్ అదే ఏడాది బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

గుల్ ఇప్పటి వరకు 130 వన్డేల్లో 179 వికెట్లు పడగొట్టగా, 47 టెస్టుల్లో 163, 60 టీ20ల్లో 85 వికెట్లు తీసుకున్నాడు.

2016లో పాక్ తరపున చివరి టీ20 ఆడిన ఉమర్ గుల్.2008 సీజన్‌లో ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్ ‌రైడర్స్ ‌కు ప్రాతినిధ్యం వహించాడు.

క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. సర్దుకుపోవాల్సిందే అంటూ?