పాకిస్తాన్ కెప్టెన్ మొండి వాదన.. నేను అవుట్ కాదంటూ..
TeluguStop.com
పాకిస్తాన్లోనే( Pakistan ) రావల్పిండి వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో పాకిస్తాన్ - బంగ్లాదేశ్ జట్లు మొదటి టెస్టులో తల్పడుతున్నాయి.
మొత్తం రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మొదటి రోజులో భాగంగా కేవలం 41 ఓవర్ల పాటే ఆట కొనసాగింది.
వరణుడు తీవ్రంగా అడ్డు కలిగించడంతో కేవలం 41 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది.
ఇక మొదటి రోజు పాకిస్తాన్ బ్యాటింగ్ చేపట్టగా ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేయగలిగింది.
మొదట్లో బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగడంతో పాకిస్తాన్ కేవలం 16 పరుగులకే మూడు ప్రధాన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
"""/" /
ముఖ్యంగా అబ్దుల్లా షఫీ కి రెండు పరుగులు, షాన్ మసూద్( Shan Masood ) ఆరు పరుగులు, కెప్టెన్ బాబర్ ఆజం( Babar Azam ) డక్ అవుట్ గా నిరాశపరిచారు.
ఇక ఆ తర్వాత వచ్చిన సౌద్ షకీల్, అయూబ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.
ఈ మ్యాచ్ లో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు.ఇకపోతే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ అంపైర్ తో తాను నాటౌట్( Not Out ) అంటూ వాగ్వాదానికి దిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.షోరిపుల్ వేసిన బంతిని మసూద్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
అయితే ఈ ప్రయత్నం కాస్త విఫలమైంది. """/" /
ఈ సమయంలో బంతి బ్యాటర్ పాడ్, అలాగే బ్యాటుకు మధ్య నుంచి వెళ్తూ బంగ్లా వికెట్ అండ్ దాస్ చేతిలోకి చేరుకుంది.
మొదట ఈ సన్నివేశంలో ఫీల్డ్ అంపైర్( Field Umpire ) మొదట నాటౌట్ అనే ప్రకటించిన బంగ్లాదేశ్ రివ్యూకు వెళ్ళింది.
అయితే అక్కడ రివ్యూలో అల్ట్రా ఎడ్జ్ పాజిటివ్ గా రావడంతో ఫీల్డ్ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు.
దాంతో ఫీల్డ్ అంపైర్ కూడా అవుట్ ఇవ్వడంతో అసలు సంగతి మొదలైంది.బంతి ప్యాడ్ కు తగిలిందని బ్యాట్ కు కాదంటూ పాకిస్తాన్ కెప్టెన్ వాదనకు దిగాడు.
అయితే మొత్తంగా మసూద్ అసంతృప్తి గాని మైదానాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది.ప్రస్తుతం ఈ అవుట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చిరంజీవి కి లెజెండరీ అవార్డు మోహన్ బాబు వల్ల మిస్ అయిందా..? నాగార్జున వల్ల దక్కిందా..?