పాకిస్థాన్ కూడా చంద్రయాన్ ప్రయోగం.. అది చూసి నవ్వేసుకుంటున్న ఇండియన్స్!

భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం ( Chandrayaan-3 ) జులై 14న విజయవంతమైన సంగతి తెలిసిందే.

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో లాంచ్ అయిన ఈ రాకెట్ చంద్రుడి పైకి( Moon ) దూసుకెళ్లింది.

ఆగస్టు 5న చంద్రుడి కక్షలోకి ఇది ప్రవేశించనుంది.ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక మరపురాని మైలురాయిగా మిగిలిపోయింది.

విజయవంతంగా చంద్రయాన్-3 రాకెట్ నింగికెగిసిన సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు మేరా భారత్ మహాన్ అని నినాదాలు చేస్తూ సగర్వంగా ఫీలవుతున్నాడు.

మరోవైపు పాకిస్థాన్ ప్రజలు ఈ విజయాన్ని ఓర్వలేక పోతున్నారు.తాజాగా తాము కూడా చంద్రయాన్ ప్రయోగిస్తామంటూ పాకిస్థాన్ ప్రజలు( Pakistan ) ఓ బెలూన్ రాకెట్‌ను ఎగర వేశారు.

దీనికి సంబంధించిన వీడియోను @Atheist_Krishna ట్విట్టర్ అకౌంట్ తాజాగా షేర్ చేసింది.ఈ వీడియోకు ఇస్రో చంద్రయాన్ 3 కోసం రూ.

615 కోట్లు ఖర్చు చేస్తే, పాకిస్థాన్ అలాంటి రాకెట్ ప్రయోగించడానికి కేవలం 15 రూపాయలు ఖర్చు చేసిందంటూ ఫన్నీగా కామెంట్ జోడించారు.

"""/" / వైరల్ వీడియోలో పాక్ ప్రజలు ఒక పెద్ద బెలూన్( Balloon ) పట్టుకొని ఉండటం చూడవచ్చు.

ఆ బెలూన్ కింద మంట మండుతోంది.సాధారణంగా బెలూన్ కింద మంట పెట్టినప్పుడు, అది తేలియాడే సూత్రం కారణంగా గాలిలోకి పైకి లేస్తుంది.

అగ్ని బెలూన్ లోపల గాలిని వేడి చేసినప్పుడు, గాలి అణువులు వేగంగా కదులుతూ వ్యాప్తి చెందుతాయి.

అప్పుడు వాటి సాంద్రత తగ్గుతుంది.చుట్టూ ఉన్న చల్లని గాలి దట్టంగా ఉంటుంది, లోపల వేడిచేసిన గాలితో పోలిస్తే బెలూన్ దిగువన ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.

ఈ పీడన వ్యత్యాసం వల్ల బెలూన్ ఎగురుతుంది. """/" / ఈ సింపుల్ సూత్రంతో పాక్ ప్రజలు ఒక బెలూన్ పైకి ఎగరవేశారు.

తామేదో చంద్రయాన్ 3 ఎగుర వేస్తున్నట్లు కౌంటింగ్ కూడా చేశారు.అది ఎగిరిన తర్వాత చప్పట్లు కొడుతూ గొప్ప విజయాన్ని సాధించినట్లు బిల్డప్ ఇచ్చారు.

అయితే ఈ ఫన్నీ వీడియో చూసి ఇండియన్స్ బాగా నవ్వేసుకుంటున్నారు.పోనీలే ఇలాగైనా సంతోషపడనివ్వండి అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

వీడియో వైరల్: బంగారం షాపులో తెగబడ్డ దొంగలు.. వ్యక్తి మృతి..