పొట్టకు కుడి వైపున వచ్చే నొప్పిని అంత తేలిగ్గా మాత్రం తీసుకోకూడదు.. ఎందుకంటే..
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలలో ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు.
వారిలో కొంతమందికి కడుపునొప్పి కూడా వచ్చిపోతూ ఉంటుంది.అందుకే దాన్ని చాలామంది ప్రజలు తేలిక తీసుకుంటూ ఉంటారు.
అయితే పొట్టకి కుడివైపు మూలలో వచ్చే నొప్పి చాలా భయంకరమైనది.భయంకరమైన రోగాలకు లక్షణంగా అని చెప్పవచ్చు.
అది చిన్న నొప్పి అయినా తేలికగా తీసుకోవడం అంత మంచిది కాదు.ఒకసారి వైద్యుల దగ్గరికి వెళ్లి పరీక్షలను చేయించుకోవడం మంచిది.
ఎందుకంటే పొట్టకు కుడి వైపున ప్రేగులు, కాలేయం వంటి జీర్ణ క్రియలో పాల్గొనే ముఖ్యమైన అవయవాలు ఉంటాయి.
అందువల్ల నొప్పి రావడం అనేది ఆ అవయవాలకు సంబంధించినది అయి ఉండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పొత్తికడుపు భాగంలోనే పెద్ద ప్రేగులు, స్త్రీలలో కుడి అండాశయం కూడా ఉంటాయి.వాటికి ఇన్ఫెక్షన్లు వచ్చినా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా నొప్పి వలే అది బయటకు కనిపిస్తుంది.
కుడివైపున నొప్పి వచ్చినప్పుడు ఈ వ్యాధులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. """/"/
పొత్తికడుపు కుడి భాగంలో నిర్దిష్ట ప్రాంతంలో నొప్పి సన్నగా వచ్చి పెరుగుతూ వస్తుందంటే అది అపెండిసైటిస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ఇచ్చిన ఒక ట్యూబు లాంటి నిర్మాణం ఇది.
జ్వరం, విరోచనాలు, వాంతులు బలహీనంగా మారడం మొదలైన వాటికి ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది.
ఆ ప్రాంతంలో ఎక్కువ నొప్పి వస్తుంది.అంటే దాని నుంచి ఉపశమనం పొందడానికి అప్రెంటిక్స్ ను తొలగించాల్సి ఉంటుంది.
దీన్ని తొలగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి చెడు ఉండదు. """/"/
మూత్రపిండాల సమస్యను నెఫ్రో లీతియాసిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవారి వరకు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడుతున్నాయి.రాళ్లు చిన్న సైజులో ఉంటే మూత్ర వ్యవస్థ ద్వారా సులభంగా బయటకి వస్తూ ఉంటాయి.
కానీ పెద్ద రాళ్లు మాత్రం ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ ఉంటాయి.ఈ నొప్పి వీపుకి దిగువన పొత్తి కడుపుకి పక్కన గజ్జల చుట్టూ ఉంటుంది.
కాబట్టి నొప్పి అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు.
పసుపు దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!