ఆయన చేతుల్లోకి వెళ్లిన పాడుతా తియ్యగా..?
TeluguStop.com
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ సింగర్ లు ఉన్నారు.వీరందరూ ఇండస్ట్రీలోకి రావడానికి పాడుతా తీయగా వేదిక పునాదులుగా మారిందని చెప్పవచ్చు.
గత పాతిక సంవత్సరాల నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేషమైన ఆదరణ దక్కింది.
ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీ గాయకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.గత 25 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం అమాంతం ఆగిపోయింది.
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గత ఏడాది అనారోగ్యం కారణంగా మరణించడం వల్ల ఆయన మరణం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆపివేశారు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్వాహకులు ఈ కార్యక్రమ బాధ్యతలను ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్ పి చరణ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇకపై పాడుతా తీయగా బాధ్యతలను ఎస్పీ చరణ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
"""/"/
ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఆన్లైన్ ద్వారా 4 వేల మందిని ఆడిషన్ చేయగా కేవలం 16 మందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమ బాధ్యతలను ఎస్పీ చరణ్ తీసుకోగా ఈ కార్యక్రమంలో చంద్రబోస్, సునీత, విజయ్ ప్రకాష్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఎస్.పీ.
బాలసుబ్రహ్మణ్యం మాదిరిగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?