పడుకొని నిద్రపోతే చాలు 11 లక్షలు ఇస్తారు..! కాకపోతే 20-45 వయసు వారు మాత్రమే.!
TeluguStop.com
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెప్పినట్టు నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర రెండు మంచి మొగుడు.
తనకే కాదు చాలా మందికి నిద్ర అంటే చాలా ఇష్టం.అందుకే పనిపాట లేకుండా నిద్రపోతున్నారు అనే కామెంట్స్ రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి.
అయితే అలంటి వారికోసం పెద్ద బంపర్ ఆఫర్.జస్ట్ పడుకుని నిద్రపోతే చాలు కొన్ని లక్షలు మీ సొంతం అయిపోతాయి.
కాకపోతే మన దేశంలో కాదండోయ్.మరి ఎక్కడో ఒక లుక్ వేసుకోండి.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఫ్రాన్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా నిద్రపోయే వారి కోసం వెదుకుతున్నారు.
ఉద్యోగం పొందినవారు మూడు నెలలు నిద్రపోవాలి అంతే.అందుకోసం ఏకంగా 16 వేల యూరోలు( దాదాపు 11.
2 లక్షలు) చెల్లిస్తారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భార రహిత స్థితిలో పునరుత్పత్తిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే మూడు నెలలపాటు నిద్రించే వారి కోసం వెతుకుతున్నారు.జాబ్ కోసం వచ్చేవారు.
!--nextpage Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
పరిశోధన కోసం మూడు నెలల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది.
ఇందులో మూడు దశలు ఉంటాయి.మొదటి రెండు వారాలు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత 60 రోజులు నిద్రపోవాల్సి ఉంటుంది.తర్వాత తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు రెండు వారాలు పునరావాస కేంద్రానికి పంపిస్తారు.
అయితే ఈ ఉద్యోగం చూడడానికి ఈజాగా కనిపించినా కఠినమైన నిబంధనలు ఉన్నాయి.ఇందులో మొదటిది తలను కిందికి ఆరు డిగ్రీల కోణంలో వంచి నిద్రపోవాలి.
ఒక భుజం ఎప్పుడూ మంచాన్ని ఆనుకుని ఉండాలి.ఈ 60 రోజులు తినడం, పడుకోవడం, వాషింగ్ తదితర నిత్యకృత్యాలు ఉంటాయి.
అయితే జాబ్‌ను ఆశించేవారు తప్పనిసరిగా మగవారై ఉండాలి.పొగతాగే అలవాటు ఉండకూడదు.
20-45 ఏళ్ల మధ్య ఉండాలి.పూర్తి ఆరోగ్యకరంగా ఉండాలి.
రోజూ ఆటలాడేవారు అయి ఉండి అలర్జీలు లేని వారు అయి ఉండాలి.బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) 22-27 మధ్య ఉండేవారు ఈ ఉద్యోగానికి అర్హులు.
కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. చిటికెలో తగ్గించే చిట్కాలు ఇవి!