పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రివ్యూ
TeluguStop.com
చిత్రం: పద్మవ్యూహంలో చక్రధారి,నటీనటులు: ప్రవీణ్ రాజ్‌కుమార్, శశికా టిక్కూ, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా తదితరులు.
,సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్య , సినిమాటోగ్రఫీ: జీ.అమర్ ,ఎడిటర్: ఎస్ బీ ఉద్దవ్,పీఆర్ఓ: హరీష్, దినేష్ , బ్యానర్: వీసీ క్రియేషన్స్ని ర్మాత: కే.
ఓ.రామరాజు ,దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు , విడుదల:21/06/2024.
వీసీ క్రియేషన్స్ బ్యానర్( VC Creations Banner) పై కే.ఓ రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి( Padmavyhamlo Chakradhari ) ప్రవీణ్ రాజ్‌కుమార్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమా నేడు థియేటర్లో విడుదలైంది.
ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది.
దాంతో ప్రేక్షకుల మంచి అంచనాలు ఏర్పడ్డాయి.యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
H3 Class=subheader-styleకథ:/h3p """/" /
రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది.
ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్ రాజ్‌కుమార్) సిటీలో ఐటీలో జాబ్ చేసుకుంటూ స్నేహితులతో ఉంటాడు.
అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది.
చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు.దాంతో ఇద్దరు మంచి స్నేహితులు, ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు.
అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది.విషయం తెలుసుకున్న చక్రీ తన ఉద్యోగానికి లీవ్ పెట్టి తాను కూడా విలేజ్‌కి వెళుతాడు.
హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషన్‌గా పనిచేస్తాడు.అతని సాయంతో సత్యను కలువాలి అనే ప్లాన్ చేస్తాడు.
అదే విలేజ్‌లో స్కూల్ టీచర్‌గా పద్మ(అషురెడ్డి) పనిచేస్తుంది.తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు.
బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా తన పాస్ట్‌లో జరిగిన సంఘటనలకు ఆ ఊరి వారంటే ద్వేషం పెంచుకుంటాడు.
అతను తాగుబోతు అవుతాడు.ప్రేమకోసం వచ్చిన చక్రీ సత్యను దక్కించుకున్నాడా లేదా? పద్మ తాగుబోతు అయిన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.
? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p
చక్రవ్యూహంలోకి ఎవరు వెళ్లినా బయటకు రాలేరు.దాని నుంచి ఎలా బయట పడాలో తెలిసిన వ్యక్తులు ఒకరు అర్జునుడు, మరొకరు ఆ చక్రధారుడైన శ్రీకృష్ణుడు.
అన్ని తెలిసిన చక్రీ ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని ఎలా బయటకు వచ్చాడు అనేదే ఈ కథ.
సిటీలో మొదలు పెట్టిన కథను పల్లెటూరికి షిఫ్ట్ చేస్తారు.ఫస్ట్ ఆఫ్‌లో అన్ని క్యారెక్టర్లను రివీల్ చేసే విధానం బాగుంది.
ముఖ్యంగా కామెడీగా ఉంది.గ్రామంలో కన్పించే రెగ్యూలర్ క్యారెక్టర్లను చాలా ఫన్నీగా రాసుకున్నారు.
కథలో మైన్ ప్లాట్ ప్రేమ.దాన్ని ఫస్ట్ ఆఫ్ లో చక్కగా చూపించారు.
హీరో హీరోయిన్ల నడుమ ప్రేమ పుట్టడం, అది డెవలప్ అవుతున్న సమయంలో హీరోయిన్ ఊరికి రావడంతో హీరో తన విలేజ్‌కు వస్తాడు.
తనను కలువడానికి ఎలక్ట్రీషన్ అయిన శ్రీను హెల్ప్ తీసుకోవడం, అలాగే అంటీలతో పులిహోర కలిపే శ్రీను పాత్రలు ఆద్యంతం అలరిస్తాయి.
ఇక సెకండ్ హాఫ్‌లో ఎక్కడా కామెడీ తగ్గలేదు.ఇక హీరో హీరోయిన్లు దొరికిపోయిన తరువాత సత్య వాళ్ల నాన్న తన అల్లుడికి ఉండవలిన క్వాలిటీస్ చెప్పడంతో సినిమాలో మరో కాన్‌ఫ్లిక్ట్స్ మొదలు అవుతుంది.
అందుకోసం బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ దగ్గరకు వెళ్లడం, నిజం తెలుసుకొని ప్రసాద్ మారడం అలాగే ప్రసాద్( Prasad ) ఫ్లాష్ బ్యాక్ లో తన ప్రేమ కథ కూడా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
ఇక హీరో హీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ సైతం బాగుంది.కిట్టు క్యారెక్టరైజేషన్ కూడా అలరిస్తుంది.
తెరమీద తాను చేసే పనులకు సదరు యాడియన్స్ కోపం వస్తుంది.మొత్తం సెకండ్ ఆఫ్ కూడా కామెడీ తగ్గకుండా భావోద్వేగాలతో కట్టిపడేశారు.
పాటలు కూడా అలరించాయి. """/" /
H3 Class=subheader-styleఎవరెలా చేశారు:/h3p
హీరోగా ప్రవీణ్ రాజ్‌కుమార్ తొలిపరిచయం అయినా సరే నటన పరంగా మెప్పిస్తాడు.
లవ్ సీన్లలో చాలా బాగా నటించాడు.అలాగే సాంగ్స్ కూడా మెప్పించే విధంగా ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా చేశాడు.కచ్చితంగా సిల్వర్ స్క్రీన్‌పై మంచి భవిష్యత్తు ఉంది.
అలాగే హీరోయిన్ శశికా టిక్కూ అద్భుతంగా నటించింది.ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో తన కళ్లతో, హావభావాలతో అలరించింది.
తెలుగు నేటివిటీకి ఫిట్ అవుతుంది.కచ్చితంగా ఈ సినిమాతో మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఇక అషురెడ్డి తను గ్లామర్ క్యారెక్టర్ కాకుండా సెటిల్డ్ క్యారెక్టర్ చేసింది.ఒక పిల్లాడి తల్లిలా నటించింది.
మురళిధర్ గౌడ్ తన క్యారెక్టర్ మేరకు మెప్పించాడు.అలాగే మహేష్ విట్టా కామెడీ అద్భుతంగా పండించాడు.
మధునందన్ నటన బాగుంది.రెండు వెరియేషన్స్ ఉన్న పాత్ర చేశాడు.
ఇక కోటి పాత్రలో నటించిన భూపాల్ రాజ్ పెద్ద పాత్ర.అందులో జీవించాడు.
అలాగే ధనరాజ్, రూపా లక్ష్మి, చైల్డ్ ఆర్టిస్టులు తదితరులు తమ పాత్రల మేర మెప్పించారు.
H3 Class=subheader-style
సాంకేతిక అంశాలు:/h3p
దర్శకత్వం మెప్పిస్తుంది.అలాగే ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు.
రచయిత దర్శన్ రాసుకున్న డైలాగ్స్ తెరమీద అద్భుతంగా పండాయి.విలేజ్ నెేటివిటీకి తగ్గట్టుగా డైలాగ్స్ బాగా రాసుకున్నారు.
సినిమాటోగ్రఫీ బాగుంది.ఈ విషయంలో జీ.
అమర్ కు మంచి మార్కులే పడుతాయి.అలాగే నేపథ్య సంగీతం బాగుంది.
ముఖ్యంగా సువ్వి సువ్వి పాట చాలా బాగుంది.ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
నిర్మాణ విలువలు ఉన్నంతలో చాలా బాగున్నాయి.విలేజ్ నేపథ్యంలో సాగే కథ కాబట్టి పల్లె వాతవరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్/h3p
కథ, కథనం,కామెడీ ,నటీనటులు.h3 Class=subheader-styleమైనస్ పాయింట్స్/h3p
అక్కడక్కడ కాస్త స్లో అనిపిస్తుంది.
H3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.
వామ్మో.. యాపిల్ టీతో ఇన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా..?