పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి- పద్మశాలి రాజకీయ యుద్ధభేరి, ఆత్మగౌరవ పోస్టర్ల ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని ఐక్యతతో ముందుకు సాగి రాణించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర నేత లగిశెట్టి శ్రీనివాస్( Lagishetti Srinivas ) పేర్కొన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి రాజకీయ యుద్ధభేరికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆ సంఘం నాయకులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకు తగిన గుర్తింపు లేకుండా పోతుందని అన్నారు.

నరాలను పోగులుగా చేసి వస్త్రాలను తయారుచేసిన నేతన్న జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన తమకు హక్కులు మాత్రం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పద్మశాలిలకు జరుగుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రతి పద్మశాలి బిడ్డ నడుంబిగించి కదం తొక్కాలని పిలుపునిచ్చారు .

రాజకీయ పార్టీలు పద్మశాలీలను ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు.పద్మశాలీలు చైతన్యవంతులై సంక్షేమం కోసం పోరాడాలని సూచించారు.

ఈనెల 13న కోరుట్లలో జరిగే పద్మశాలి రాజకీయ యుద్ధభేరి సభకు పద్మశాలీలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని లగిశెట్టి శ్రీనివాస్ కోరారు.

కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గోనె ఎల్లప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, పద్మశాలి సేవా సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు బొందయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్రంప్‌కు జైకొట్టిన డెమొక్రాట్ మాజీ నేత తులసీ గబ్బార్డ్.. ఆ ధైర్యం ఆయనకే ఉందంటూ వ్యాఖ్యలు