పాదయాత్ర ఎఫెక్ట్  ! లోకేష్ కు ఈ స్థాయిలో మద్దతా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈనెల 27వ తేదీ నుంచి యువ గళం పేరుతో పాదయాత్రను మొదలు పెట్టబోతున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ప్రజల్లో మద్దతు కూడగట్టడంతో పాటు, టిడిపి శ్రేణులను ఏకం చేసే ఉద్దేశంతో లోకేష్ యాత్రను నిర్వహిస్తున్నారు.

గతంలో వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పాదయాత్ర నిర్వహించే పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో,  ఇప్పుడు లోకేష్ కూడా అదే బాట పడుతున్నారు.

ఇదిలా ఉంటే లోకేష్ నిర్వహించబోయే యువ గళం పాదయాత్రకు పార్టీ శ్రేణుల నుంచి అప్పుడే ఊహించని స్పందన వస్తోంది.

ఇప్పటి వరకు గ్రూపు రాజకీయాలతో సొంత పార్టీ నాయకులు మధ్య సఖ్యత లేనట్టుగా పరిస్థితి కనిపించినా,  ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో నాయకుల మధ్య సఖ్యత పెరిగింది.

  """/"/  ఒక్కొక్కరుగా నారా లోకేష్ ను కలుస్తూ పాదయాత్రకు తమ మద్దతును తెలుపుతున్నారు.

ఇప్పటికే మాజీమంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లోకేష్ తో భేటీ అయి పాదయాత్రకు మద్దతు ప్రకటించారు.

టిడిపి తరఫున ఆయన యాక్టివ్ గా కార్యక్రమాలు చేపడుతున్నారు.మొదటి నుంచి ఆయన టిడిపిలో ఉన్నా.

లేనట్టుగానే వ్యవహరించినా,  ఇప్పుడు మాత్రం తను మనసు మార్చుకున్నారు.ఇప్పటికే మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప , పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ తదితరులు లోకేష్ ను కలిసి తమ తమ ప్రాంతాల్లో పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను తీసుకున్నారు.

ఆయా ప్రాంతాల్లో ఈ యాత్రను సక్సెస్ చేసే బాధ్యత తమదేనని లోకేష్ కు హామీ ఇచ్చారట.

టిడిపి ఎమ్మెల్యేలు,  నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు ఇలా అంతా ఒక్కొక్కరుగా లోకేష్ ను కలుస్తూ పాదయాత్రకు తమ మద్దతు పలుకుతున్నారట.

  """/"/   ఈనెల 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలవుతుంది.దాదాపు నాలుగు వేల కిలోమీటర్లను 400 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర  కొనసాగునుంది.దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

ఊహించని విధంగా పార్టీ శ్రేణుల నుంచి పాదయాత్రకు ఈ స్థాయిలో మద్దతు లభిస్తుందడంతో లోకేష్ కూడా మరింత ఉత్సాహంగా ఉన్నారట.

 .

టాలీవుడ్ ఐటీ దాడుల వెనుక బాలీవుడ్ మాఫియా.. షాకింగ్ విషయాలు వైరల్!