వైసీపీలో పోటీ పాదయాత్రలు.. మంత్రి వర్సెస్ ఎంపీ
TeluguStop.com

అధికార పార్టీ వైసీపీలో కీలక నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు.చిత్రంగా మారింది.


ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు నేతలు వ్యూహాలకు పదును పెంచుతున్నారు.అది కూడా విశాఖ ఉక్కు ఉద్యమం వేదికగా జరుగుతుండడం గమనార్హం.


విశాఖ ఉక్కు విషయంలో అధికార పార్టీ ఇరుకున పడింది.ఈ క్రమంలో రంగంలోకి దిగిన మంత్రి అవంతి శ్రీనివాస్.
విశాఖ ఉక్కు కార్మికుల పక్షాన నిలిచారు.నిత్యం వారితోనే ఉంటున్నారు.
ఒకరకంగా.ఆయన అదే అధికారిక కార్యక్రమం అన్నట్టుగా మారిపోయింది.
ఇక, ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రను అనధికారికంగా ఏలుతున్న వైసీపీ ఎంపీ, సీనియర్ నాయకుడు.
విజయ సాయిరెడ్డికి కూడా ఉక్కు ఎఫెక్ట్ సోకింది.దీంతో ఆయన కూడా తనకు బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇక్కడ కార్మికులకు టచ్‌లో ఉంటున్నారు.అంతేకాదు.
ఎప్పుడూ.అఖిల పక్ష భేటీ అంటే.
మండిపడే సాయిరెడ్డి.విశాఖ ఉక్కు కోసం.
అఖిల పక్ష భేటీ నిర్వహించేందుకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు.ఇతర నేతలతో కలిసి ప్రసంగాలు చేశారు.
"""/"/
ఇంత వరకుబాగానే ఉన్నా.విశాఖ ఉక్కుకోసం.
మంత్రి, ఎంపీ.ఇద్దరూ పోటీ పడి మార్కులు సంపాయిం చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో ఇద్దరి ఇది ఆధిపత్యానికి దారితీసీంది.దీంతో అవంతి అనూహ్యంగా పాదయాత్ర చేస్తానంటూ.
పెద్ద ప్రకటన చేశారు.ఇది బాగానే వర్కవుట్ అయింది.
ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ సెగ నుంచి తప్పించుకునేందుకు.
అవంతి ఈ ప్లాన్ చేశారని టాక్ వచ్చింది.అయితే.
అవంతి అలా ప్రకటన చేశారో లేదో.ట్విట్టర్ వేదికగా ముందుకు వచ్చిన సాయిరెడ్డి కూడా పాదయాత్రకు ప్రకటన చేశారు.
విశాఖ జంక్షన్ నుంచి కూర్మన్న పాలెం వరకు ఉక్కు కోసం పాదయాత్ర చేస్తానని ప్రకటించడం .
వైసీపీలో చర్చకు దారితీసింది.ప్రతిపక్షాలు ఈ పాదయాత్రను డ్రామా యాత్రగా కొట్టేస్తే.
వైసీపీలో మాత్రం ఆధిపత్య యాత్రగా చెవులు కొరుక్కొంటున్నారు.ఒకే విషయంపై ఇద్దరు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా? పైగా ఎంపీ అయి ఉండి.
ఏదైనా ఉంటే.పార్లమెంటులో పాదయాత్ర చేయాలి.
అంటూ.సాయిరెడ్డికి విమర్శలు వస్తున్నాయి.
ముంబై వడా పావ్‌కు ఫిదా అయిన ఫారిన్ వ్లాగర్.. మరాఠీ మాట్లాడి ఆకట్టుకుందిగా!