Padaharella Vayasu : రాఘవేంద్రరావు గారి అంచనా తప్పి విజయాన్ని అందుకున్న పదహారేళ్ళ వయసు..!
TeluguStop.com
శ్రీదేవి, రజనీకాంత్ హీరో హీరోయిన్స్ గా తమిళ భాషలో వచ్చిన పదహారేళ్ల వయతినిలే ( 16 Vayathinile )అనే చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు.
ఈ చిత్రాన్ని భారతి రాజా తెరకెక్కించగా, అద్భుతమైన వసూల్లను సాధించింది.అయితే ఈ సినిమాను తెలుగులో పదహారేళ్ళ వయసు( Padaharella Vayasu ) పేరుతో రాఘవేంద్రరావు రీమేక్ చేశారు.
అలాగే హిందీలో కూడా రీమేక్ చేయబడింది.అయితే తమిళంలో సినిమాకి తెలుగులో వచ్చేసరికి అనేక మార్పులు జరగాల్సి వచ్చింది.
ఈ విషయం గురించి దర్శకుడు, నిర్మాత ఇద్దరు కూడా గొడవపడ్డారట.దాని గురించి నా పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సినిమా ఇండస్ట్రీ పైన ఉన్న ఇంట్రెస్ట్ తో ఒక వ్యక్తి లారీ అమ్ముకుని మరి ఆరు లక్షల రూపాయలతో తమిళంలో పదునారు వయతినిలే చిత్రాన్ని తీయగా, మొదట రెండు వారాలు ఎవ్వరూ చూడలేదు.
మూడో వారం నుంచి బాగానే ఊపందుకుంది. """/"/ ఈ సినిమాను చూసిన మిద్దే రామారావు తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు.
దీనిని రాఘవేంద్రరావు గారి( K Raghavendra Rao ) చేత రీమేక్ దర్శకత్వం చేయించాలనుకున్నారు.
అయితే తెలుగు రీమేక్ హక్కుల కోసం అప్పట్లో కేవలం 30 నుంచి 40 వేలు మాత్రమే పెడుతున్న సమయంలో ఏకంగా 1,50,000 నిర్మాత డిమాండ్ చేయగా, కింద మీద పడి లక్ష 17 వేలకు ఓకే చేయించుకున్నారు.
ఆ సమయంలో అది చాలా పెద్ద అమౌంట్ అని మిగతా నిర్మాతలు అంత గగ్గులు పెడుతున్న వినకుండా ఆయన కొన్నారు.
దాన్ని తెలుగులో నిర్మిస్తున్న సమయంలో తమిళ్ క్లైమాక్స్ కి తెలుగు క్లైమాక్స్ కి తేడా ఉంది.
ఎందుకంటే తమిళంలో హీరో హీరోయిన్స్ ఇద్దరు ఎప్పటికీ కలవరు అన్నట్టుగానే చూపిస్తారు. ""img Src=
తెలుగులో హ్యాపీ ఎండింగ్( Happy Ending ) ఉండాలని నిర్మాత పట్టుపట్టారు.
కానీ పేరు చెడిపోతుందని రాఘవేంద్రరావు భయపడ్డారు.అయితే రెండు క్లైమాక్స్ లు తీసి సెన్సార్ వారు ఓకే ఏది చేస్తే అది పెడదామని నిర్మాత చెప్పడంతో అందరికీ రెండు క్లైమాక్స్ లు చూపించడంతో అందరూ హ్యాపీ ఎండింగ్ ని ఇష్టపడ్డారు.
ఆ సమయంలో రాఘవేంద్రరావుకి 45 వేల పారితోషకం( Raghavendra Rao Remuneration ) ఇవ్వగా శ్రీదేవికి 30000 హీరో పాత్ర చేసిన చంద్రమోహన్ కి 12,500 మోహన్ బాబుకి 10000 చొప్పున ఇచ్చుకున్నారు నిర్మాత.
పదహారేళ్ళ వయసు చిత్రం తెలుగులో ఎంతటి క్లాసిక్ సినిమాగా మిగిలిపోయిందో మనకు తెలిసిందే.