అత్యంత అరుదైన టీ పొడి.. కిలో అక్షరాలా రూ.లక్ష!

మన ఇంట్లో వాడే టీ పొడి వందల రూపాయల్లో ఉంటుంది.మహా అయితే రూ.

2 వేలు కూడా దాటదు.అయితే కిలో టీ పొడి ధర రూ.

లక్ష అంటే నమ్ముతారా? అయితే నిజంగానే కిలో టీ పొడి ధర రూ.

లక్ష పలికింది.అస్సాం తోటల్లో సాగు చేసిన అరుదైన టీ పొడిని తాజాగా వేలం వేయగా కిలో రూ.

లక్ష పలికింది.దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.అస్సాం అంటేనే తేయాకు తోటలకు ప్రసిద్ధి.

ఎటు చూసినా తేయాకు తోటలతో భూమిపై పచ్చని తోరణాలు కట్టినట్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

ఆ ప్రాంతంలో పర్యటించాలని చాలా మందికి ఉంటుంది.ఇక నాణ్యమైన, అధిక రుచిగల టీ ఆకులకు అస్సాం ప్రసిద్ధి చెందింది.

అస్సాంలో పండించే టీ ఆకుల కంటే ఏ టీ మంచిది కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ తాగేవారు చెబుతుంటారు.

రుచికరమైన టీ తాగడం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఉత్తమమైన దానిని పొందడానికి టీ ప్రేమికులు ఏ స్థాయికైనా వెళతారు.

"""/" / తాజాగా అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన 'పభోజన్ గోల్డ్ టీ' అనే అరుదైన ఆర్గానిక్ టీ కిలో రూ.

1 లక్ష పలికింది.జోర్హాట్‌లోని వేలం కేంద్రంలో టీ పొడి కోసం వేలం వేయగా ఈ భారీ ధర దక్కింది.

టీ పొడి కోసం ఈ ఏడాది చెల్లించిన అత్యధిక మొత్తం ఇదే.జోర్హాట్ టీ వేలం కేంద్రం (JTAC) అధికారి దీనిపై స్పందించారు.

'పభోజన్ ఆర్గానిక్ టీ' ఎస్టేట్ విక్రయించిన టీ పొడిని అస్సాంకు చెందిన ప్రముఖ టీ పొడి బ్రాండ్ అయిన ఈసా టీ కొనుగోలు చేసిందని తెలిపారు.

ఈ పభోజన్ టీ పౌడర్‌లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.బంగారు రంగులోకి మారే వీటి కోసం ఎంతైనా ధర చెల్లించేందుకు వెనుకాడరు.

రుచి పరంగానూ ఎంతో వైవిధ్యంగా ఉండే దీని కోసం కొనుగోలుదారులు వేలంలో భారీ ధర వెచ్చిస్తారు.

Chandra Mohan : చంద్రమోహన్‌కి వణుకు పుట్టించిన అలీ కూతురు..