యూకే : 500 ఏళ్ల నాటి పురాతన విగ్రహం .. భారత్‌కు తిరిగివ్వనున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ

యూకేలోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ( Oxford University ) కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్‌లోని తమిళనాడు రాష్ట్రంలోని ఓ దేవాలయం నుంచి చోరీకి గురైనట్లుగా భావిస్తోన్న 500 ఏళ్ల నాటి ఓ సాధువు కాంస్య విగ్రహాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైంది.

అష్మోలియన్ మ్యూజియం( Ashmolean Museum ) నుంచి 16వ శతాబ్ధం నాటి ‘తిరుమంగై ఆళ్వార్ ’( Saint Tirumankai Alvar ) కాంస్య విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని భారత హైకమీషన్ దాఖలు చేసిన దావాకు మద్ధతు ఇస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ తీర్మానాన్ని ఛారిటీ కమీషన్ ఆమోదం కోసం త్వరలోనే సమర్పిస్తామని వెల్లడించింది. """/" / 60 సెంటీమీటీర్ల పొడవున్న తిరుమంగై ఆళ్వార్ విగ్రహాన్ని డాక్టర్ జేఆర్ బెల్మాంట్ (1886-1981) అనే కళాఖండాల సేకరణదారుడి నుంచి 1967లో సోథెబీ ఆక్షన్ హౌస్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని అష్మోలియన్ మ్యూజియం కొనుగోలు చేసింది.

అయితే ఈ మ్యూజియం గతేడాది నవంబర్‌లో ఒక స్వతంత్ర పరిశోధకుడి ద్వారా ఈ పురాతన విగ్రహ మూలల గురించి తెలుసుకుని, ఆపై భారతీయ హైకమీషన్‌ను అలర్ట్ చేసింది.

ఆ వెంటనే తమిళనాడులోని( Tamil Nadu ) ఓ దేవాలయం నుంచి దొంగిలించబడినట్లుగా నమ్మతున్న కాంస్య విగ్రహాన్ని తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం అధికారికంగా అభ్యర్ధించింది.

"""/" / కాగా.దొంగిలించబడిన భారతీయ కళాఖండాలు, వస్తువులు యూకే( UK ) నుంచి భారతదేశానికి తిరిగొచ్చిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి.

గతేడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విగ్రహం, అలాగే 17వ శతాబ్ధం నాటి తమిళనాడుకు చెందిన నవనీత కృష్ణుడి కాంస్య విగ్రహలు స్కాట్‌లాండ్ యార్డ్ ఆర్ట్ అండ్ యాంటిక్స్ యూనిట్‌తో కూడిన యూకే, యూఎస్ సంయుక్త పరిశోధన తర్వాత బ్రిటన్‌లోని భారతీయ హైకమీషనర్‌కు అప్పగించారు.

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన చిత్రాలు, పురాతన కళాఖండాలను అష్మోలియన్ మ్యూజియం కలిగి ఉంది.

తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించడంతో తమిళనాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.