Potato Crop : బంగాళదుంప సాగులో పోషకాల యాజమాన్యం.. విత్తనం విత్తుకునే విధానం..!

కూరగాయ పంటలలో ఒకటైన బంగాళాదుంప పంట( Potato Crop ) సాగుకు తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి.

బంగాళాదుంప పంట ఆలస్యంగా విత్తుకుంటే, దుంపలు ఊరే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దుంపలు సరిగా ఊరావు.

దీంతో నాణ్యత గల పంట దిగుబడి( Yield ) పొందలేము.కాబట్టి బంగాళదుంప పంటను అక్టోబర్ చివరి వారం నుండి నవంబర్ రెండవ వారం మధ్య వరకు విత్తుకోవాచ్చు.

"""/" / ఎప్పుడైనా దుంప జాతి పంటలు సాగు చేయాలనుకుంటే.నేల వదులుగా అయ్యేలా రెండు లేదా మూడు సార్లు దున్నుకోవాలి.

నేల వదులుగా ఉంటేనే దుంపలు బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది.వేసవికాలంలో చివరి దుక్కిలో ఒక ఎకరం పొలానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 35 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు( Potash Fertilizer ) వేసి పొలాన్ని కలియదున్నుకోవాలి.

పొలంలో ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగించాలి. """/" / దుంప జాతి పంటలలో విత్తనం విత్తుకునే విధానం అత్యంత కీలకం.

ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందాలంటే తెగులు నిరోధక మేరు రకం నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

ఒక ఎకరాకు 600 కిలోల బంగాళాదుంప విత్తనాలు అవసరం.దుంప జాతి పంటలను ఎత్తు బోదెల పద్ధతి ద్వారా సాగు చేస్తే, పొలంలో నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది.

దీంతో దుంప కుళ్ళు తెగుళ్లు పంటను ఆశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

బోదెల మధ్య 90 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు బోదెలను ఏర్పాటు చేసుకోవాలి.మొక్కల మధ్య కనీసం 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

బంగాళా దుంప సాగుకు నీటి అవసరం చాలా తక్కువ.కాబట్టి నీటి వనరులు తక్కువగా ఉండే నేలలో కూడా బంగాళదుంప సాగు చేయవచ్చు.

ఇక విత్తనం నాటిన తర్వాత వెంటనే ఒక నీటి తడి అందించాలి.ఆ తరువాత నేలలోని తేమ శాతాన్ని బట్టి పది రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.

దుంపలు తయారయ్యే వరకు ఇలా నీటి తడులు అందించాలి.దుంపలు తయారయ్యాక ఆరు రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.

రామ్ చరణ్ తో మరోసారి పంచే కట్టిస్తున్న సుకుమార్…