స్కిన్‌ను డిటాక్స్ చేసే బెస్ట్ ఫేస్ మాస్క్ ఇది.. తప్పకుండా ట్రై చేయండి!
TeluguStop.com
శరీరంలోని మలినాలను, అదనపు కొవ్వును తొలగించే ప్రాసెస్‌ను డిటాక్సింగ్ అంటారు.ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారందరూ బాడీని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేసుకుంటారు.
అలాగే స్కిన్‌ను కూడా డిటాక్స్ చేయాలి.అప్పుడే చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
ముఖ్యంగా ముఖ చర్మాన్ని డిటాక్స్ చేసేందుకు ఇప్పుడు చెప్పబోయే ఫేస్ మాస్క్ అద్భుతంగా సహాయ పడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ మాస్క్ ఏంటో.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.
? చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్‌కోల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఫేస్ మాస్క్ సిద్ధమైనట్టే.
దీనిని ఎలా వాడాలంటే.నైట్ నిద్రించే ముందు నార్మల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత నిద్రించాలి.
"""/" /
ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజుకు ఒక సారి చేయడం వల్ల మలినాలు, మృత కణాలు తొలగి పోయి స్కిన్ డిటాక్స్ అవుతుంది.
అలాగే ఈ ఫేస్ మాస్క్‌ను తరచూ ట్రై చేయడం వల్ల ఆయిలీ స్కిన్ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు.
అవును, ఈ మాస్క్ వేసుకుంటే చర్మంపై ఉండే ఎక్సస్ ఆయిల్ పోయి ఫేస్ ఫ్రెష్‌గా, గ్లోగా మారుతుంది.
అంతే కాదు, ఈ ఫేస్ మాస్క్‌ను యూజ్ చేయడం వల్ల.అలోవెర, చార్‌కోల్‌లో ఉండే కొన్ని ప్రత్యేక సుగుణాలు పిగ్మెంటేషన్ సమస్యను నివారిస్తాయి.