బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి చేరిస్తే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!!
TeluguStop.com

ఇటీవల కాలంలో చాలా మందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది.ఈ సమస్య ఉన్న వారు బరువు తగ్గేందుకు పడేపాట్లు అన్నీఇన్నీ కావు.


ఆహారం, జీవనశైలి, వృత్తి ఉద్యోగాల ప్రభావంతో అమాంతం బరువు పెరుగుతుంటారు.ఇలాంటి వారు ఎంతటి డైట్ మొయింటెన్ చేసినా బరువు తగ్గడంలో మాత్రం విఫలమౌతుంటారు.


ఆహారమార్పులు, ఎక్సర్‌సైజ్‌లు, యోగాసనాలు ఇలా ప్రతిఒక్కటిని పాటిస్తారు.అయినా అనుకున్న ఫలితం రాక ఆవేదన చెందుతుంటారు.
వాస్తవానికి అధిక బరువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.అధిక బరువుకు చెక్ పెట్టడంతో పాటు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
బరువు తగ్గటానికి చేయాల్సిన మొదట పని ఆహారంలో మార్పు.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు.
మీ మార్నింగ్‌ని గ్రీన్ జ్యూస్‌తో ప్రారంభించండి.అంటే ఆకుపచ్చ కూరగాయ, కొన్ని ఆకులను గ్రీన్ జ్యూస్ రూపంలో తయారు చేసుకుని తీసుకోవాలి.
అలాగే మీ బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజు యొక్క ముఖ్యమైన ఆహారం.బ్రేక్‌ఫాస్ట్‌లో ఎం తీసుకుంటారో అది మీ రోజంతా ప్రభావితం చేస్తుంది.
అందుకే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో తాజా పండ్లు మరియు నట్స్‌తో నింపుకోవాలి.ముఖ్యంగా నానబెట్టిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, వాల్‌నట్స్ వంటివి తీసుకోవాలి.
ఇక పండ్ల విషయానికి వస్తే.బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్, అరటిపండు ఇలా తాజా పండ్లను చేర్చుకోవాలి.
సహజసిద్ధంగానే ఎన్నో ఆరోగ్య లాభాలను నింపుకుని ఉండే పళ్లు బరువు తగ్గేందుకు కూడా సాయపడతాయి.
పళ్లలో అధిక మోతాదులో పీచు పదార్థం ఉంటుంది.సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి.
ఇవి ఆకలికి అడ్డుకట్ట వేస్తాయి.అధిక బరువుని తగ్గిస్తాయి.
అయిల్‌తో తయారు చేసిన ఫుడ్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో అస్సల తీసుకోరాదు.ఇక పంచదారతో తయారు చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
నీరు ఎక్కువగా తీసుకోవాలి.రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయండి.
శాండ్‌విచ్, బర్గర్, నూడుల్స్ లాంటి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.ఈ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గొచ్చు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి31, సోమవారం 2025