వైరల్ వీడియో: రోడ్డుమీద చెత్తను పడేసిన మహిళకు బుద్ది చెప్పడానికి ఆ యువతి చేసిన పనికి సూపర్ అని మెచ్చుకుంటారు..ఏం చేసిందంటే.!
TeluguStop.com
చైనాలోని బీజింగ్‌లో ఓ యువతి చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది.ఆ యువతి చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ యువతిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగింది.అంటే బీజింగ్‌లోని ఓ రోడ్డు మీద సిగ్నల్ పడినప్పుడు కారు ఆగింది.
కారులో వెళ్తున్న మహిళ అక్కడ ఒక చెత్త కవర్ ని బయటికి విసిరేసింది.
ఈ ఘటన అంతా వెనుక ఉన్న కార్ డ్యాష్ బోర్డులోని కెమెరాలో రికార్డయింది.
అయితే అప్పుడే బైక్ మీద అటువైపుగా వచ్చిన ఒక యువతి .ఆ చెత్త బ్యాగ్ ను చూసింది.
చూసి ఏం చేసిందో ఒకసారి గెస్ చేయండి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
మనకెందుకులే అని వెళ్లిపోయిందా అని అడుగుతారా.
కార్లో ఉన్నావిడతో గొడవపెట్టుకుందా.కాదూ మరేం చేసిందంటే.
ఆ చెత్త బ్యాగ్ తీసి చెత్త బుట్టలో వేసిందా.చాలా మంది ఇలాగే చేస్తారు.
కానీ మన అమ్మడు చాలా గడుసుది అనుకుంటా.ఆ చెత్తను తీసి అదే కారులో విసిరేసింది.
వెంటనే సిగ్నల్ పడగానే వెనక్కి చూడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
హమ్మయ్య కారులో చెత్త బయటపడేసా అనుకున్న ఆ మహిళ మళ్లీ కారులోకి చెత్తను విసిరేయడంతో మొదట విస్తుపోయింది.
వెంటనే చిర్రెత్తుకొచ్చి.కోపంతో డోర్ తీసి ఆ యువతిని ఆపబోయింది.
కానీ.అప్పటికే ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది .బాగా బుద్ది చెప్పింది అంటూ అందరూ ఆ యువతిని మెచ్చుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతున్నారా..?