మాది బీసీల ప్రభుత్వం..: మంత్రి చెల్లుబోయిన

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్య నేతలు సమావేశమైయ్యారు.ఈ భేటీకి మంత్రులు బొత్స, ముత్యాలనాయుడు, వేణుగోపాల కృష్ణ, జయరాం, జోగి రమేశ్ తదితర ముఖ్యనేలు హాజరైయ్యారు.

ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు.

డిసెంబర్ 8న విజయవాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని బీసీ నేతలు తెలిపారు.

ఇందిరాగాంధీ స్టేడియంలో సుమారు పది వేల మందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.కాగా ఈ సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.

తమది బీసీల ప్రభుత్వమని, డిక్లరేషన్ లోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

4 మందారం పువ్వులతో ఇలా చేశారంటే నెల రోజుల్లో మీ జుట్టు అవుతుంది డబుల్..!