KCR : మన నీళ్లు మన హక్కు .. సెంటిమెంట్ రాజేస్తున్న కేసీఆర్

రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) వ్యూహాత్మకంగా నే అడుగులు వేస్తున్నారు.

కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి చెందడం,  ఆ ప్రభావం రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కనిపించబోతుండడంతో, మరోసారి తెలంగాణలో సెంటిమెంట్ రాజేసి తద్వారా వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే ఆలోచనతో కెసిఆర్ ఉన్నారు.

దీనిలో భాగంగానే చలో నల్గొండ( Chalo Nalgonda ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణను ఎడారిగా చేసే కుట్రలకు కాంగ్రెస్ తెర తీసింది అని, ఆ పార్టీ నేతల చేతకానితనంతో కృష్ణ నదిపై ప్రాజెక్టుల పెత్తనాన్ని కేంద్రం చేతుల్లో పెట్టిందని,  అందుకే తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి రావద్దంటూ మన నీళ్లు మన హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.

"""/" / మన నీళ్లు మన హక్కు పేరుతో నల్గొండలో పోరు శంఖారావం పూరించారు.

ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ సభలో కెసిఆర్ ప్రసంగిస్తారు.

నల్గొండ పట్టణ శివారులో నార్కట్ పల్లి,  అద్దంకి హైవేకు ఆనుకుని మర్రిగూడ బైపాస్ లో విశాలమైన స్థలంలో ఈ సభను నిర్వహించబోతున్నారు.

ఇప్పటికే ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. """/" / నల్గొండ,  ఖమ్మం ,మహబూబ్ నగర్, రంగారెడ్డి,  హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు( Farmers ) తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.

అలాగే వాహనాల పార్కింగ్ కోసం అనువుగా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు.సభ ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి( Ex Minister Jagadish Reddy ) పర్యవేక్షిస్తున్నారు.

ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) బీఆర్ఎస్ కు సానుకూలత ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

కువైట్ అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు.. పోలీసుల అదుపులో 8 మంది