19 నుండి ఓయూ పీజీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ !‌

ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి డేట్ ఫిక్స్ అయింది.

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఓయూ పీజీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్నాయి.

ఈ పరీక్షల కోసం ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీలో ఇప్పటివరకు ఎన్నడూలేని విధంగా మొట్టమొదటిసారి సెమిస్టర్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలన ఏర్పాటు చేస్తున్నారు.

</br> ఈ కారణంతో వర్సిటీ హాస్టళ్లలోకి విద్యార్థులను అనుమతించడం లేదు.ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాస్టళ్లలో చేరితే కరోనా అక్కడ విజృంభించే అవకాశం ఉంది.

దీనితో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పరీక్షలు నిర్వహించేలా వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

</br> దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.ఓయూలో చదివే విద్యార్థులు తమకు అనుకూలమైన పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకునేందుకు ఓయూ వెబ్‌ సైట్ ‌లో వివరాలను అందుబాటులో ఉంచారు.

విద్యార్థులు తమకు అనుకూలమైన పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకునేందుకు ఓయూ వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింకును ఏర్పాటు చేశారు.

ఈ నెల 12వ తేదీ వరకు వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

ఆ తర్వాత వారు ఎంపిక చేసుకున్న సెంటర్లలో పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం ఉంటుంది.

</br>.

బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తు ముమ్మరం.. నటి హేమకు నోటీసులు