ఆడియన్స్ కోసం పోటీ పడుతున్న ఓటీటీలు ..!?

దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వాడకం విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు.కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది.

దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది.

అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.

దీంతో ఆఫర్లు, సినిమాలతో ఓటీటీలు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.వివిధ ఓటీటీ వేదికలు ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు, నిలబెట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి.

కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు , ఆఫర్లతో ముందుకొస్తున్నాయి.ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ వేదిక ఆహా.

40 సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ముందుకొచ్చింది.అటు జీ5 ఏకంగా 80 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రవేశపెట్టింది.

అటు అమెజాన్ ప్రైమ్ కూడా 40 కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చింది మొత్తానికి ఓటీటీలు పోటీ పడి కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు స్ట్రీమ్ చేస్తున్నాయి.

స్పెషల్ షోలు, వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలతో ప్రేక్షకుడికి కావల్సిన వినోదాన్ని అందించడం ద్వారా వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు, సబ్‌స్క్రిప్షన్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

తెలుగువారికి నచ్చే తెలుగు వారు మెచ్చే కంటెంట్‌ను అందించడానికి ఆహా ఓటీటీ బాగా ట్రై చేస్తోంది.

అయితే ఎండలు మండే మే నెలలో బయటికేం వెళ్తాంలే అనుకునే వారి కోసం ఆహా గుడ్ న్యూస్ చెప్పేసింది.

30కి పైగా బ్లాక్‌బస్టర్‌ హాలీవుడ్‌ సినిమాలను తెలుగులో అందించనున్నట్లు ప్రకటించింది.‘అనకొండ’, ‘బ్యాడ్‌ బాయ్స్‌ 2’, ‘చార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’, ‘స్పైడర్‌ మ్యాన్‌’, ‘టెర్మినేటర్‌’, ‘రెసిడెంట్‌ ఈవిల్‌’, ‘బ్లాక్‌ హాస్‌ డౌన్‌’ సహా మరికొన్ని హాలీవుడ్ హాట్ మూవీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఈమధ్యే మలయాళ సూపర్‌ హిట్‌ ‘దొంగాట’ ఆహాలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.

ఆహాపురంలో ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమా రిలీజ్‌ చేస్తామని ఇదివరకే ప్రకటించినట్టు క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ రెడీగా ఉన్నాయని చెబుతోంది ఆహా.

ఒక్క సినిమాలే కాదు ఆహాలో ప్రసారమవుతోన్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో, సర్కారు వంటివి మంచి పేరు సంపాదిస్తున్నాయి.

"""/"/ ఈ మధ్యే ప్రైమ్‌ వీడియో తన సబ్‌ స్క్రైబర్లను గుడ్ న్యూస్త్ తో అలర్ట్ చేసింది.

కొత్త కొత్త వెబ్‌ సిరీస్‌ లు, సినిమాలతో పండగ చేసుకోమని బిగ్ ఈవెంట్ నిర్వహించి మరీ చెప్పేసింది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రానున్న రోజుల్లో దాదాపు 40 ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ లు, సినిమాలను ప్రేక్షకులకు అందించనున్నట్లు ప్రకటించింది.

తెలుగు, తమిళ, హిందీతోపాటు వివిధ భాషల్లో వీటిని నిర్మిస్తున్నారు.మరోవైపు జీ5 కూడా అన్ని భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

80 వరకూ సినిమాలు, వెబ్‌సిరీస్‌లను పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ చేయనుంది.ఇందులో 40 వరకూ ఒరిజినల్ షోలుంటే.

మరో 40 సినిమాలున్నాయి.ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

బిగ్‌బాస్ ఓటీటీ ఇప్పటికే ప్రధాన ఆకర్షణగా ఉండగా.ఐపీఎల్ 2022 ప్రత్యక్ష ప్రసారం మరో ఆకర్షణగా ఉంది.

త్వరలో ఆర్ఆర్ఆర్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఇలా చేస్తే సహజంగానే నల్లటి కురులు మీ సొంతమవుతాయి!