దీపావళి వినోదాలు.. పండుగ కానుకగా విడుదలయ్యే సినిమాలివే..

కరోనా మహమ్మారి వల్ల థియేటర్స్‌లో సినిమాల విడుదల ఆగిపోయింది.చాలా కాలం పాటు థియేటర్స్ ఓపెన్ కాలేదు.

దాంతో ఓటీటీల్లో ఆల్టర్నేట్ సినిమాలు విడుదల అయ్యాయి.ఆ నేపథ్యంలోనే థియేటర్స్‌లో చిత్రాల విడుదల ఉండబోదేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

కానీ, పరిస్థితులు చక్కబడ్డాయి.ఒక్కొక్కటిగా సినిమాలు టాకీసుల్లో సందడి చేయడం స్టార్ట్ అయింది.

దీపావళి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.ఆ సినిమాలు ఏవేవంటే.

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్- శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అన్నాత్తె’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దీపావళి కానుకగా ఈ నెల 4న విడుదల కానుంది.

తెలుగులో ఈ మూవీ ‘పెద్దన్న’గా రిలీజ్ కానుంది.యాక్షన్ హీరో విశాల్ నటించిన ‘ఎనిమి’ మూవీ కూడా దీపావళి రోజే రానుంది.

టాలీవుడ్ యంగ్ హీరో సంతోశ్ శోభన్- డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కిన ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా కూడా ఈ నెల 4న విడుదల కానుంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ పిర్జాదా నటించింది.బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’ ఈ నెల 5న విడుదల కానుంది.

హాలీవుడ్ ఫిల్మ్ ‘ఇటర్నల్స్’ ఈ నెల 5న థియేటర్స్‌లో సందడి చేయనుంది.తమిళ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య నటించిన ‘జై భీమ్’ దీపావళి కానుకగా ఈ నెల 2న ‘అమెజాన్ ప్రైమ్’ ఓటీటీలో విడుదల కానుంది.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘గల్లీ రౌడీ’ ఫిల్మ్ ఈ నెల 4న డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది సుధీర్ బాబు హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈ నెల 4 నుంచి జీ5‌లో స్ట్రీమింగ్ అవనుంది.

ఇవే కాక నెట్‌ఫ్లిక్స్‌లో ‘ద వెడ్డింగ్‌ గెస్ట్‌, ద హార్డర్‌ దే ఫాల్‌, ద అన్‌లైక్లీ మర్డరర్‌, లవ్‌ హార్డ్‌’ హాలీవుడ్ సినిమాలు ఈ వారంలో విడుదల కానున్నాయి.

నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?