OTT : పెద్ద దర్శక నిర్మాతల ఉసురు పోసుకుంటున్న ఓటిటి

ఓటిటి.సినిమాను నిర్మాత, హీరో లేదా దర్శకుడు మాత్రమే రూల్ చేయగలరు అనే విషయాన్ని నిర్మొహమాటంగా ఖండించిన ప్లాట్ఫామ్.

ఎంత పెద్ద దర్శకుడైన నిర్మాత అయిన సినిమా తీశారు అంటే అది కచ్చితంగా ఏదో ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ కి ఇచ్చి తీరాల్సిందే అంటే వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపైనే ఉండడం నిజంగా శోచనీయం.

వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే వారి వెనుక పడుతుంది ఓటీటి కానీ చిన్న సినిమా తీసే వారికి మాత్రం చుక్కలు చూపించడంలో ఎలాంటి మొహమాటానికి పోదు.

బయట నిర్మాతలు మాకు సినిమాలు ఇవ్వాల్సిన పనిలేదు మా సినిమాని మా కంటెంట్ ని మేమే తీసుకోగలం అంటూ నిర్మాణ రంగంలోకి కూడా ఎంటరయింది.

ప్రతి నిర్మాణ సంస్థ ఒరిజినల్స్ పేరుతో వారి సంస్థలోనే కొత్త సినిమాలను వెబ్ సిరీస్( Web Series ) లను ప్రవేశపెడుతుంది.

"""/" / మరి బయట సినిమాలకు డిమాండ్ లేదా అంటే కచ్చితంగా ఉంది కానీ ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీరు తాగించి అప్పుడు అది తక్కువ ధర పెట్టడం కోసం వారి చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు.

ఒక వంద సినిమాలు తీసిన దర్శకుడు తన ఫ్లాప్ అయిన సినిమాను ఏ ఓటీపీ ఛానల్ లో వేయలేకపోతున్నాడు అంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అంత ఎందుకండీ రామానాయుడు( Ramanaidu ) లాంటి ఒక నిర్మాత మీ ముందు తలవంచాలా నేను ఒక సినిమా కోసం అంటూ చివరి దశలో కృంగిపోయారంటే నమ్మి తీరాల్సిందే ఎవరి ముందు చేతులు కట్టుకోవాల్సిన అవసరం నిర్మాతకు లేదు అని ఆయన కచ్చితంగా నమ్మేవారు.

సినిమా ఇండస్ట్రీ నీ ఈ స్థాయికి తీసుకచ్చిన మేము వంగి వంగి మీ ముందు సినిమాను పెట్టలేము అంటూ కూడా రామానాయుడు చివరి రోజుల్లో తన దగ్గరికి వచ్చేవారికి చెప్పేవారట.

"""/" / మరి ఇంతటి నిర్మాతలు దర్శకులు ఇంతలా ఓటీపీ విషయంలో ఎడమొహంగా ఉన్నారు అంటే అందుకు గల కారణం సదరు ఓటిటి ప్లాట్ఫారం నిర్వాహకులు కంటెంట్ తీసుకునే విషయంలో పెడుతున్న రూల్స్ కావచ్చు అలాగే వాటికి ఇస్తున్న డబ్బు కావచ్చు ఏదేమైనా రాజమౌళి( Rajamouli ) లాంటి పెద్ద దర్శకులు వస్తే తప్ప తమ సినిమాని అమ్ముకోలేని పరిస్థితిలో ఇప్పుడు దర్శక నిర్మాతలు ఉన్నారు.

పైగా థియేటర్లో విడుదల కాలనీ ఏ సినిమా అయినా ఓటీడీకే వస్తుంది కాబట్టి అంతటి తల విరుచు వారికి రావడం మామూలే కావచ్చు కానీ ప్రతి సినిమాలో ఎంతో కొంత రేటుతో కొనుక్కొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించకపోయినా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే చాలు అని కొన్ని వర్గాల వారి అభిప్రాయం.

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!