Venu Thottempudi : సత్తా ఉన్న నటులను టాలీవుడ్ ఎప్పుడు వదులుకోదు… అందుకు ఇదే ఉదాహరణ
TeluguStop.com
టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ట్యాలెంట్ ఉంటుంది.అందులో కొంత మంది మాత్రం స్టార్ డం అనుభవిస్తూ మంచి సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
కానీ మరికొంత మంది మాత్రమే ఇక్కడ నిలదొక్కుకోలేరు.అందుకు అనేక కారణాలు ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే సరైన కథలను ఎంచుకొక మంచి మంచి నటులు కనుమరుగు అయిపోతూ ఉంటారు.
అంతే కాదు డిసిప్లిన్ లేకపోవడం, పెద్ద వారితో విభేదాల కారణం తో మరికొంత మంది ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నారు.
కానీ మంచి ట్యాలెంట్ ఉన్న నటులను ఇండస్ట్రీ ఎప్పుడు వదులుకోవడం జరగదు. """/" /
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో వేణు తొట్టెంపూడి( Venu Thottempudi ).
ఈయన స్వయవరం వంటి సినిమాతో వంటి కామెడీ ప్రధాన సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
కెరీర్ మొత్తం కామెడీ మాత్రమే తన జోనర్ గా భావించి, బాడీ లాంగ్వేజ్ తో, కామెడీ టైమింగ్ తో మంచి హీరో గా ఎదిగాడు.
కానీ కారణాలు ఖచ్చితంగా తెలియదు కానీ వేణు మాత్రం కొన్నేళ్ల పాటు ఎవరికి కనిపింకాకుండా పోయాడు.
కానీ అప్పుడప్పుడు ఇండస్ట్రీ మాత్రం అతడిని గుర్తు చేసుకుంటూనే ఉంది.సోషల్ మీడియా లో సైతం వేణు గురించి ఎప్పుడు ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉండేది.
అందుకే సినిమాల్లో సోలో గా విజయాలు సాధించే మార్కెట్ లేకపోవడం తో ఇప్పుడు అతడిని ఓటిటి ఒడిసి పట్టుకుంది.
"""/" /
అతిధి ( Athidhi )అనే ఒక కొత్త సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వేణు ఈ సారి గట్టి విజయం సాధిస్తాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది.
ఆయన అభిమానులు సైతం వేణు కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.అందుకే వేణు లాంటి 47 ఏళ్ల హీరోను అందరూ ఇంకా ఇష్టడతారు.
వేణు మాత్రమే కాదు నవీన్ వడ్డే లాంటి హీరో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఈ హీరోలు థియేటర్ లో మార్కెట్ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం కానీ ఓటిటి లో మాత్రం ఆ సమస్య ఉండదు.
చాలా మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి సమయం.
రాజమౌళి సినిమాలు వీళ్లకు శాపంగా మారయా..?